నల్గొండ, : హాలియాలో సీఎం కేసీఆర్ బహిరంగసభకు ఏర్పాట్లు- పూర్తయ్యాయి. టీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులతో పాటు- అధికారులు కూడా అన్ని సంసిద్ధం చేశారు. సభకు వచ్చే జనానికి ఎటు-వంటి ఇబ్బందులు కలుగ కుండా పూర్తిస్థాయిలో ఏర్పాట్లు- చేశారు. ఏవైపు నుండి వచ్చే వాహనాలకు అటు-వైపు పార్కింగ్ కేటాయించారు. ట్రాఫిక్ స్తంభించకుండా పోలీసు లు ముందస్తు ఏర్పాట్లు- చేశారు. అయితే ఉమ్మడి నల్గొండ జిల్లాలోని అన్ని ప్రాంతాల నుండి 3లక్ష లకు తగ్గకుండా జనాన్ని తరలిస్తున్నారు. నాగార్జున సాగర్ నియోజకవర్గంతో పాటు- మిర్యాలగూడ, దేవరకొండ, నల్గొండ, మునుగోడు ప్రాంతాల నుండి పెద్దఎత్తున కేడర్‌ను తరలిస్తున్నారు. అంతే కాకుండా హుజూర్‌నగర్, కోదాడ, నకిరేకల్, తుంగతుర్తి నియోజకవర్గాల నుండి కూడా తరలిస్తున్నారు. స్వయంగా ఎమ్మెల్యేలు బాధ్యతలు తీసుకొని తరలించే ఏర్పాట్లు- చేశారు. బస్సులు, సుమోలు, తుపాన్లతో పాటు- ప్రత్యేక వాహనాల్లో తరలివెళ్లేందుకు సిద్ధమయ్యారు. ప్రతి గ్రామం నుండి బస్సులు కేటాయించి జనాన్ని తరలించే పనిలో నిమగ్నమయ్యారు. ఇదిలా ఉంటే గత కొన్నేళ్లుగా సీఎం కేసీఆర్ బహిరంగ సభ ఉమ్మడి జిల్లాలో లేకపోవడంతో జనం కూడా సీఎం సభలో ఆయన మాటలు వినేందుకు తరలివెళుతున్నారు. అయితే సభకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు- చేశారు. ముందుగా సీఎం కేసీఆర్ ఉమ్మడి నల్గొండ జిల్లాకు కేటాయించిన లిప్ట్n ఇరిగేషన్ ప్రాజెక్టుల శంకుస్థాపన చేయనున్నారు. తిరుమలగిరి(సాగర్) మండలం లోని నెల్లికల్ లిప్ట్n ఇరిగేషన్ ప్రాజెక్ట్ కు శంకుస్థాపన చేస్తారు. అక్కడే ఉమ్మడి జిల్లాకు కేటాయించిన అన్ని ఇరిగేషన్ ప్రాజెక్ట్ లకు శంకుస్థాపన చేస్తారు. దీనితో పనులు ప్రారంభం కానున్నాయి. ఆ తరువాత హాలియా సమీపంలోని 14వమైలు రాయి వద్ద కృతజ్ఞత బహిరంగ సభ నిర్వహిస్తు న్నారు. పెద్ద ఎత్తున జనం తరలివచ్చి అభినం దనలు తెలపనున్నారు. అయితే హాలియా సభతో సాగర్ ఉపఎన్నికల నగారా కేసీఆర్ ప్రారంభించ నున్నారు. ఈసభతో సీఎం నేతలతోపాటు- కేడర్‌కు దిశానిర్దేశం చేయనున్నారు. ఏది ఏమైనా ముఖ్యమంత్రి కేసీఆర్ సభకు భారీ ఎత్తున తరలి వెళుతున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement