Tuesday, November 26, 2024

Challenge – మ‌హారాష్ట్రలో బిఆర్ఎస్ ఒక్క సీటు గెలిచినా రాజ‌కీయ స‌న్యాసం తీసుకుంటా – మాణిక్ రావు ఠాక్రే…

హైద‌రాబాద్ – కర్ణాటకలో ఇటీవలి వరకు ఉన్న బీజేపీ ప్రభుత్వానిది 30 శాతం కమీషన్ సర్కార్ అయితే, తెలంగాణలో ఏకంగా 50 శాతం కమీషన్ సర్కార్ నడుస్తోందని తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే ఆరోపించారు. మహారాష్ట్రలో బీఆర్ఎస్ ఒక్క సీటు గెలిచినా తాను రాజకీయాలకు దూరంగా ఉంటానని సవాల్ చేశారు. బీఆర్ఎస్ ను ఎదుర్కొనే సత్తా కాంగ్రెస్ కు మాత్రమే ఉందని ప్రజలు నమ్ముతున్నారన్నారు.

హైద‌రాబాద్ లో నేడు జ‌రిగిన యూత్ కాంగ్రెస్ స‌మావేశంలో ఆయన మాట్లాడుతూ, బీఆర్ఎస్, బీజేపీ రెండు ఒకటేనని తెలంగాణ విమ‌ర్శించారు… బీజేపీ, బీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం ఉందన్నారు. ఒప్పందం ప్రకారమే వారు పని చేస్తున్నారని ఆరోపించారు. అందుకే తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు ఢిల్లీ పర్యటన అని ధ్వజమెత్తారు. ఇక్కడ తెలంగాణలో బీజేపీతో వైరం అంటున్నారని, ఢిల్లీలో మాత్రం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలుస్తున్నారని దుయ్యబట్టారు. ఆ రెండు పార్టీల మధ్య ఎలాంటి ఒప్పందం లేకుంటే ఎమ్మెల్సీ కవిత పైన చర్యలు ఏవ‌ని ప్ర‌శ్నించారు ఠాక్రే..

Advertisement

తాజా వార్తలు

Advertisement