నిజామాబాద్ ప్రతినిధి, (ఆంధ్రప్రభ) : పసుపురైతుల సంక్షేమానికి తోడ్పడాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అరవింద్ ధర్మపురి, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి గురువారం ఢిల్లీలోని కేంద్ర వాణిజ్య శాఖ కార్యాలయంలో మంత్రి పీయూష్ గోయల్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా జాతీయ పసుపు బోర్డు చైర్మన్‌గా ఎన్నికైన పల్లె గంగారెడ్డికి మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. దశాబ్దాల కల సాకారమైందని, పసుపు రైతుల సంక్షేమానికి పాటుపడాలని మంత్రి సూచించారు. అంతే కాకుండా పసుపు ఎగుమతులు, మార్కెటింగ్ తదితర అంశాలపై చర్చించారు.
ఈ సందర్భంగా జాతీయ పసుపు బోర్డు చైర్మన్‌గా తనను నియమించినందుకు కేంద్ర మంత్రికి పల్లె గంగారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో వారితో పాటు జగిత్యాల జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు మోరేపల్లి సత్యనారాయణ పాల్గొన్నారు.