కమలాపూర్, డిసెంబర్ 14 (ఆంధ్రప్రభ) : హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని అంబాల గ్రామంలో శుక్రవారం రాత్రి చైన్ స్నాచింగ్ జరిగింది. కిరాణం షాపు నిర్వాహకురాలు కేత్తే శ్రీలత మెడలో నుంచి పుస్తెలతాడును దుండగులు అపహరించి పారిపోయారు. అంబాల గ్రామ శివారులోని సకేత పాఠశాల సమీపంలో శుక్రవారం రాత్రి 10గంటల తర్వాత నలుగురు వ్యక్తులు బైకుపై వచ్చి తంసప్ కావాలంటూ షాపులోకి వచ్చి మహిళ మెడలో నుంచి బంగారు గొలుసును లాక్కొని పారిపోయారు.
శనివారం ఉదయం బాధితురాలు పోలీసులను ఆశ్రయించగా సిఐ హరికృష్ణ ఆధ్వర్యంలో దుండగుల కోసం అన్వేషణ జరుగుతుంది. బాధితురాలు ఇంటి సమీపంలోని సీసీ కెమెరాల పుటేజీల సహకారంతో పోలీసులు దుండగులను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ హరికృష్ణ వెల్లడించారు.
- Advertisement -