Tuesday, November 19, 2024

తెలంగాణ ధాన్యం సేకరణపై కేంద్రం కీలక ప్రకటన

తెలంగాణ నుంచి ధాన్యం సేకరణపై కేంద్రం అధికారిక ప్రకటన చేసింది. టీఆర్ఎస్ ఎంపీలు నామనాగేశ్వర రావు, మాలోత్ కవిత, రంజిత్ రెడ్డి, పసునూరి దయాకర్, వెంకటేశ్ నేత అడిగిన ప్రశ్నలకు కేంద్ర సహాయ మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి రాతపూర్వక సమాధానమిచ్చారు. దేశవ్యాప్తంగా 2021-22 ఖరీఫ్‌లో వరి ధాన్యం సేకరణ టార్గెట్ 521.89 లక్షల మెట్రిక్ టన్నులుగా పేర్కొంది. రబీ (యాసంగి) సీజన్ మొదలయ్యాక రబీ టార్గెట్ నిర్ణయిస్తామని తెలిపింది. 2020-21 రబీలో మొత్తం 55 లక్షల మెట్రిక్ టన్నుల టార్గెట్ పెట్టుకోగా.. 61.87 లక్షల మెట్రిక్ టన్నులు రాష్ట్రాల నుంచి సేకరించినట్లు వివరించింది.

మిగులు బియ్యాన్ని రాష్ట్రాలు తీసుకోవాల్సిందిగా కోరడంతో టార్గెట్ మించి తీసుకున్నామని చెప్పింది. తెలంగాణ నుంచి ఈ ఖరీఫ్‌లో 40 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించాల్సిందిగా ఆగస్ట్ 17న రాష్ట్ర ప్రభుత్వంతో జరిగిన సమావేశంలో నిర్ణయించామన్నారు. అయితే, పెరిగిన దిగుబడి అంచనాలు, మార్కెట్లో మిగులు, పెరిగిన సాగును దృష్టిలో పెట్టుకుని సేకరణ మరింత పెంచాలని చూస్తున్నామని పేర్కొంది. అయితే, ఎంత పెంచాలన్నది దిగుబడి అంచనాలు, మార్కెట్ మిగులు, సాగు తీరు గణాంకాల ఆధారంగా నిర్ణయిస్తామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement