Tuesday, November 26, 2024

Central team – కవ్వాల అడవుల్లో నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ బృందం

జన్నారం,ఫిబ్రవరి8(ప్రభన్యూస్): జన్నారం అటవీ డివిజన్ లోని కవ్వాల పులుల అభయారణ్యంలో నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ప్రతినిధులు నేడు ప‌ర్య‌టించారు.. డివిజన్ లోని ఇందన్ పల్లి ,బైసన్ కుంట , గణిశేట్టి కుంట,బర్తన్ పేట బేస్ క్యాంప్ లను,దొంగపల్లి,తపాల్ పూర్ లోని బేస్ క్యాంప్ లను,వాచ్ టవర్లను ఆ బృందం ప్రతినిధులు పరిశీలించింది. బేస్ క్యాంప్ సిబ్బంది, ఫారేస్ట్ సేక్షన్,బీట్ అధికార్లతో ప్రస్తుతం ఎదుర్కుంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అడవులు, వన్యప్రాణుల పరిరక్షణకు చేపట్టబోయే పనులు అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా వేసవిలో అడవుల్లో అగ్నిప్రమాదాలు జరగకుండా చూడాలని , వన్యప్రాణులకు నీటి సౌకర్యం కల్పించాలని , అడవులను స్మగ్లర్లనుంచి కాపడడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని బృంద స‌భ్యులు సూచించారు. అభయారణ్యంలో పర్యటించిన బృందం ఇక్కడి అధికారులు చేస్తున్న,చేపట్టిన అభివృద్ధి పనుల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.

నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ప్రతినిధుల బృందంలో మధ్యప్రదేశ్,అరుణాచల్ ప్రదేశ్ కు చెందిన విశ్రాంత వైల్డ్ లైఫ్ వార్డేన్ లు యోగేశ్, అలోక్ కుమార్ లు ఉన్నారు. వారికి ముందుగా కాళేశ్వరం జోన్ సిఎఫ్,కెటిఆర్ ఎఫ్ డిపిటి శాంతారాం, మంచిర్యాల డిఎఫ్ ఓ శివ్ అశీష్ సింగ్ పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు.. ఆ ప్రతినిధుల వెంట తాళ్లపేట, జన్నారం, ఇందన్ పల్లి ఇంచార్జీ రేంజ్ ఆఫీసర్లు సుష్మారావు, ఎండి హాఫిజోద్దిన్, డిప్యూటి రేంజ్ ఆఫీసర్లు, సేక్షన్, బీట్ ఆఫీసర్లు , బేస్ క్యాంప్ సిబ్బంది ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement