నార్సింగి: ప్రముఖ రాజకీయ, ఆర్థిక అంశాల విశ్లేషకుడు పరకాల ప్రభాకర్‌కు మాతృమూర్తి, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామ్ ను అత్త పరమపదించారు. నరసాపురం మాజీ ఎమ్మెల్యే పరకాల కాళికాంబ (94) నేటి ఉదయం తెలంగాణాలోని గండిపేట మండలం మంచిరేవుల గ్రామంలో తుదిశ్వాస విడిచారు.
కాళికాంబకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పరకాల ప్రభాకర్ పెద్ద కుమారుడు. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ పెద్ద కోడలు. కాళికాంబ భౌతికకాయం వద్ద బంధువులు, శ్రేయోభిలాషులు నివాళులర్పించారు. కాగా, అత్త మరణించిన విషయం తెలుసుకున్న నిర్మలా సీతారామన్ హుటా హుటిన ఢిల్లీ నుంచి మంచిరేవులకు బయలదేరారు.