Tuesday, November 26, 2024

కూ యాప్‌తో జతకట్టిన సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఇండియన్ లాంగ్వేజెస్

సోషల్ మీడియా దుర్వినియోగాన్ని అరికట్టడంతో పాటు భాష ఉపయోగాన్ని ప్రోత్సహించడానికి భారతదేశ బహుళ భాషా మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫారం కూ హోల్డింగ్ కంపెనీ బాంబినేట్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్‌తో మైసూర్‌లోని సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్ (CIIL) అవగాహన ఒప్పందం (MOU) కుదుర్చుకుంది. భారతీయ భాషల అభివృద్ధిని సమన్వయం చేయడానికి భారత ప్రభుత్వంచే స్థాపించబడిన CIIL, యాప్ కంటెంట్ నియంత్రణ విధానాలను బలోపేతం చేయడానికి, అలాగే యూజర్లకు ఆన్‌లైన్‌లో సురక్షితమైన వాతావరణాన్ని అందించడానికి కూ తో కలిసి పని చేయనుంది.


ఈ ఒప్పందం గురించి మరిన్ని ఆసక్తికర విషయాలు తెలుపుతూ కూ యాప్ సహ వ్యవస్థాపకుడు అండ్ సీఈఓ అప్రమేయ రాధాకృష్ణ మాట్లాడుతూ… భారతీయులు బహుళ భాషల్లో సంభాషించడానికి, కనెక్ట్ అవ్వడానికి వీలు కల్పించే ఒక ప్రత్యేకమైన సోషల్ మీడియా ప్లాట్‌ఫారంగా దుర్వినియోగాన్ని అరికట్టి ఆన్‌లైన్‌ వాతావరణాన్ని మెరుగుపరచడం ద్వారా త‌మ యూజర్లను మరింత బలోపేతం చేయడానికి తాము ప్రయత్నిస్తున్నామన్నారు. తమ భాషా సంస్కృతులలోని వ్యక్తులతో అర్థవంతంగా సంభాషించడానికి ప్లాట్‌ఫారంను ఉపయోగించాలని తాము యూజర్లను కోరుకుంటున్నామన్నారు. ఈ కార్పస్‌ను నిర్మించడానికి, ఇంటర్‌కనెక్టడ్ ప్రపంచాన్ని ఇంటర్నెట్ వినియోగదారులకు మరింత సురక్షితంగా, విశ్వసనీయంగా మార్చడానికి ప్రఖ్యాత సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్‌తో భాగస్వామిగా ఉన్నందుకు తాము సంతోషిస్తున్నామన్నారు. స్థానిక భారతీయ భాషల్లో స్వీయ వ్యక్తీకరణ కోసం ఒక ప్రత్యేక వేదికైన కూ యాప్ ప్రస్తుతం తొమ్మిది భాషల్లో వినూత్న ఫీచర్లు అందిస్తుందన్నారు. త్వరలోనే మొత్తం 22 అధికారిక భారతీయ భాషలను కవర్ చేసే విధంగా అడుగులు వేస్తుందని అన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement