Wednesday, November 20, 2024

సంక్షోభ సమయంలో ప్రజలను గాలికి వదిలేశారుః కేంద్రంపై ఓవైసీ నిప్పులు

కరోనా సెకండ్ వేవ్ ను కట్టడి చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. రోజువారీ రిపోర్టుల్లో పేర్కొంటున్న గణాంకాల కంటే క్షేత్రస్థాయిలో కరోనా వ్యాప్తి చాలా ఎక్కువగా ఉందని ఐసీఎంఆర్ అధ్యయనం చెబుతోందని తెలిపారు. బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో చాలా కరోనా కేసులను లెక్కల్లో చూపలేదని ఆరోపించారు. కరోనా సెకండ్ వేవ్ ను కట్టడి చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఒవైసీ విమర్శించారు. సంక్షోభ సమయంలో ప్రజలను గాలికి వదిలేసిందని మండిపడ్డారు. చికిత్స అందించే విషయం అటుంచితే, కనీసం కరోనా కేసులను లెక్కించడంలోనూ ఏమాత్రం జాగ్రత్త చూపలేదని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement