Monday, November 18, 2024

TS: కొండగట్టు అభివృద్ధికి కేంద్ర నిధులు.. బండి సంజయ్

రాష్ట్ర ప్రభుత్వ సహకారం తీసుకుంటాం
దేవాలయాల అభివృద్ధిలో రాజకీయాలొద్దు
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్

కొండగట్టు, ఆంధ్రప్రభ : సుప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ అభివృద్ధికి కేంద్రం నుండి నిధులు తెచ్చేందుకు కృషి చేస్తానని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలియజేశారు. బుధవారం జగిత్యాల జిల్లా కొండగట్టు లోని ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కలు చెల్లించారు. అనంతరం మాట్లాడుతూ.. దేశ రక్షణకు, ధర్మరక్షణకు, సమాజ రక్షణకు పనిచేస్తానన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం అభివృద్ధికి నోచుకోలేదన్నారు. గత రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేయలేదని తాము చేస్తామంటే సహకరించలేదన్నారు.

ఎన్నికలు ముగిసాయని.. ఇక రాజకీయాలు వదిలేసి అభివృద్ధి కోసం పనిచేస్తామన్నారు. దేవాలయాల అభివృద్ధిలో రాజకీయాలు వద్దని, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో అంజన్న ఆలయాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామన్నారు. కార్యకర్త స్థాయి నుండి కేంద్ర మంత్రి స్థాయి వరకు ఎదిగానని, అమ్మవారు, అంజన్న స్వామి ఆశీస్సులతో ఈ స్థాయికి ఎదిగానన్నారు.

- Advertisement -

ఆలయ అర్చకులు, అధికారులతో మాట్లాడి సమస్యలు తెలుసుకోవడంతో పాటు ఆలయ అభివృద్ధి కోసం శక్తివంతన లేకుండా కృషి చేస్తానన్నారు. ఆలయానికి కేంద్రమంత్రి హోదాలో మొదటిసారి వచ్చిన బండి సంజయ్ కి అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామి వారి దర్శనం అనంతరం లేదా ఆశీర్వచనం అందజేసి స్వామివారి చిత్రపటం తో పాటు తీర్థప్రసాదాలు అందజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement