తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునేందుకు కేంద్రం కుట్ర చేస్తుందని తెలంగాణ మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. నల్లగొండలోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… అధికారం కోసం బీజేపీ తప్పుడు విధానాలు అవలంభిస్తున్నదని అన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి ఎంతకైనా తేగించెలా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై కేంద్ర ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు.
ఆర్థిక వనరులను కట్టడి చేయాలనే దురాలోచనలో ఉందని చెప్పారు. ఇది ఫెడరల్ వ్యవస్థకు విఘాతం కలిగించే చర్య అని ఫైరయ్యారు. ఇప్పటికైనా కేంద్ర వైఖరి మారాలని సూచించారు.ఐటీ, ఈడీ, సీబీఐలతో బీజేపీ యేతర నాయకులను ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు. తెలంగాణకు డబుల్ ఇంజన్ సర్కార్ రావాలంటే అభివృద్ధి చేసి చూపించాలని, ప్రజాస్వామ్య బద్ధంగా వ్యవహరించాలన్నారు.