మహేశ్వరం : తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం విద్యా, వైద్య ఒక్క యునివర్సిటీ ఇవ్వకుండా పక్షపాత ధోరణితో వ్యవహరించిందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. మహేశ్వరం మండలంలోని కేసి తాండ లో డిగ్రీ కళాశాలకు జడ్పీ చేర్ పర్సన్ తీగల అనితా రెడ్డి, కేసి తాండ సర్పంచ్ మోతీలాల్ నాయక్ తో కలిసి శంకుస్థాపన చేశారు. మహేశ్వరంలో సహకార సంఘం కార్యాలయంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ను ప్రారంభించారు. మహేశ్వరం మండలం గ్రామాలలోని, తుక్కుగూడ మున్సిపాలిటీ లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ….డిగ్రీ కాలేజ్ నియోజక వర్గానికి వచ్చిన సమయంలో బిల్డింగ్ లేనందువల్ల బడంగ్ పెట్ లో తాత్కాలికంగా కొనసాగిస్తుంటే ప్రతిపక్షాలు అనవసరంగా రాద్దాంతం చేశారని ఆవేదన చెందారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేతల ప్రభుత్వమని డిగ్రీ కళాశాలతో నిరూపించుకున్నామని బిజెపి వారికి పరోక్షంగా హెచ్చరించారు. కోటి రూపాయలతో గ్రంథాలయం, మరో కోటి రూపాయలతో హై స్కూల్, ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటుకు సిఎం చంద్రశేఖర్ రావ్ హామీలో భాగంగా కందుకూరు ఫార్మా సిటీ దగ్గరలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో వేంకటాచారి, ఎమ్మార్వో ఆర్.పి.జ్యోతి, ఎంపిపి రఘుమా రెడ్డి, వైస్ ఎంపిపి సునీత అంద్యా నాయక్ తో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement