Tuesday, September 17, 2024

Celebrations – సింగపూర్ లో వనపర్తి ఎమ్మెల్యే గణపతికి ప్రత్యేక పూజలు

పెద్దమందడి: సెప్టెంబర్ 7 (ప్రభ న్యూస్); …వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి కుటుంబ సమేతంగా సింగపూర్ వెళ్లిన ఆయన వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని సింగపూర్ లోని లిటిల్ ఇండియా ప్రాంతంలో గల తెలుగు సమాజం ఆధ్వర్యంలో వీరా ట్రేడర్స్ లో నిర్వహించిన వినాయకుడి పూజా కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. సతీమణి శారద రెడ్డి కుమారులు నవనీత్ రెడ్డి మనోజ్ కుమార్ రెడ్డిలు సైతం గణపతికి పూజలు చేశారు

సాంస్కృతి సాంప్రదాయాలకు మేళవింపుగా ఉండే భారత సంస్కృతికి ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రాశస్త్యం ఉందని ప్రపంచంలోని ఏ దేశానికి వెళ్లిన భారతీయులు ఎంతో ఘనంగా ఇలాంటి పూజలు నిర్వహిస్తారని ఎమ్మెల్యే పేర్కొన్నారు..

ఈ ప్రత్యేక పూజ కార్యక్రమంలో వ్యాపారవేత్త శ్రీకాంత్ తెలుగు సమాజం అధ్యక్షులు బొమ్మ రెడ్డి శ్రీనివాస్, సాఫ్ట్ వేర్ ఉద్యోగస్తుడు శ్రీధర్ రెడ్డి, మణికంఠ రెడ్డి, గోకుల్, సందీప్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement