Friday, November 22, 2024

Something Special | డిఫరెంట్​గా బిడ్డ పుట్టిన వేడుకలు​.. పేదలకు 400కిలోల టమాటాల పంపిణీ!

పిల్ల‌ల పుట్టిన రోజునాడు సాధారణంగా అన్ని వర్గాల పేరెంట్స్ ఎంతో హడావుడి చేసేస్తుంటారు. కాస్త డబ్బున్న వాళ్లు అయితే ఖ‌రీదైన హోట‌ల్స్‌లో పార్టీలు చేస్తుంటారు. ఇంకా సంపన్న వర్గాల అయితే రిట‌ర్న్ గిఫ్ట్‌లకు కూడా భారీ ఖ‌ర్చు చేసి అతిథుల‌కు అందిస్తుంటారు. ఇక.. కొంతమంది అయితే మాన‌వ‌తా దృక్ప‌థంతో హాస్పిట‌ల్స్‌లో, అనాథ గృహాల్లో పండ్లు పంపిణీ చేస్తుంటారు. కానీ ఈ పేరెంట్స్ మాత్రం కాస్త డిఫరెంట్​గా ఆలోచించారు.

నేటి పరిస్థితులను పరిశీలించి అమలు చేశారు. ఆకాశంలో చేరి సామాన్యులకు అందుబాటులో లేని ట‌మాటాలను కొన‌లేని పేద‌లపై గొప్ప మ‌న‌సు చాటుకున్నారు. త‌మ కూతురి పుట్టిన రోజు సంద‌ర్భంగా ఏకంగా 400 కిలోల ట‌మాటాల‌ను ఉచితంగా పంపిణీ చేశారు. దీంతో వారు చేసిన పని ఇప్పుడు చాలా ఫేమస్​ అయ్యింది. అందరి దృష్టిలో పడింది.

హైద‌రాబాద్‌లోని పంజాగుట్ట ప్రతాప్‌నగర్‌కు చెందిన టీఎమ్మార్పీఎస్‌ యువసేన అధ్యక్షుడు నల్ల శివ మాదిగ తన కూతురు పుట్టిన రోజు వేడుక‌ల‌ను కాస్త డిఫరెంట్​గా నిర్వహించాలి అనుకున్నాడు. అన్న‌దానం, పండ్ల పంపిణీ కాకుండా.. ట‌మాటా కూరగాయల పంపిణీ చేసి అందరి దృష్టిలో పడ్డాడు. టమాటా ధరల పెంపును దృష్టిలో పెట్టుకుని ఇవ్వాల (బుధవారం) 400 కిలోల ట‌మాటాల‌ను కొనుగోలు చేసి బస్తీలో ఫ్రీగా అందరికీ పంపిణీ చేశాడు. దీంతో ఈ విషయం తెలిసి టమాటాల కోసం పెద్ద ఎత్తున జనం ఎగబడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement