Friday, November 22, 2024

ఎవ‌రిపై సిబి’ఐ’

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో : మొయినా బాద్‌ ఫామ్‌హౌస్‌లో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోళ్ళ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. సిట్‌ విచారణను హైకోర్టు సమర్థిస్తే, అంతా సమసిపోతుందనుకున్న సమయంలో సీబీఐ విచారణకు ఆదేశించడం… ఇప్పుడు రాజకీయవర్గాల్లో ప్రత్యేక చర్చకు దారి తీస్తోంది. ఈ కేసులో కర్త, కర్మ, క్రియ పాత్ర పోషించిన ఆ నలుగురు ఎమ్మెల్యేలకు సంకటస్థితి ఏర్పడింది. అసలే ఎన్నికల ఏడాది… అందులో సీబీఐ విచారణ.. పరిణామాలు ఎలా ఉంటాయోనన్న ఆందోళన బీఆర్‌ఎస్‌ నేతల్లో కనిపిస్తోంది. బహిరంగంగా చెెప్పక పోయినా ఇటు నిందితులు, అటు పోలీసు ఉన్నతాధి కారుల బలవడం ఖాయమని రాజకీయ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. సీబీఐకి ఫామ్‌హౌస్‌ కేసు అత్యంత క్లిష్టమైనదేమీ కాదని, ఈ కేసులో ఎవరెవరికి సంబంధాలున్నాయో తేల్చే అధారాలు ఇప్పటికే వారు సేకరించారని విశ్వసనీయవర్గాలు చెబుతున్నాయి.

వాస్తవాలు ఎలావున్నా ఆ పరిణామాలు ఎన్నికలపై ఉంటాయన్న వాదన వినిపిస్తోంది. ఈ కేసులో బీజేపీ తో సంబంధాలున్న డీల్‌ వీరులు ముగ్గుర్ని తెరపైకి తెచ్చి విచారిస్తే, ఎవరెవరి పేర్లు బయటకు వస్తాయో నన్న ఆందోళన కనిపిస్తోంది. ”మోడీ నువ్వు గోకినా గోకకున్నా.. నిన్ను గోకుతా.. బీజేపీని బంగాళా ఖాతం లో కలుపుతా.. నీకు దర్యాప్తు సంస్థలున్నాయి.. నాకూ ఉన్నాయి.. కాస్కో చూసుకుందాం” అని సీఎం కేసీఆర్‌ చేసిన చాలెంచ్‌ను బీజేపీ అగ్రనేతలు తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఆ కేసు రాష్ట్ర ప్రభుత్వ ధర్యాప్తు సంస్థ సిట్‌ చేతిలోంచి కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ పరిధిలోకి వెళ్లింది.
కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి వెళ్ళిన కేసు ఎన్ని మలుపులు తిరుగుతుందోన్న ఆందోళనతో పాటు రాజ కీయ జోక్యం ఏ మేరకు ఉంటుందోనన్న విమర్శలు కూ డా జోరుగా వినిపిస్తున్నాయి. ప్రధాని నరేంద్రమోడీ, తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఏమాత్రం తక్కువకాదని బీజేపీ వర్గాలు పరోక్షంగా హెచ్చరిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తిని సుప్రీంకోర్టు అంగీకరించకుంటే, సింగిల్‌ బెంచ్‌.. డివిజన్‌ బెంచ్‌ తీర్పులతో ఇప్పటికే షాక్‌లో ఉన్న నిందితులను త్వరలోనే సీబీఐ విచార ణకు పిలువనుంది. తెలంగాణ హైకోర్టులో రెండు సా ర్లు ప్రతికూల పరిస్థితులు ఎదురవడంతో దేశ అత్యున్నత న్యాయస్థానంలోనూ అదే జరుగుతుం దన్న వాదన బలపడుతోంది. ఎమ్మెల్యేల ఎర కేసులో సిట్‌ దర్యాప్తు కొనసాగించేలా సుప్రీం తలుపు తట్టేందు కు ఇప్పటికే రాష్ట్ర పోలీసుశాఖ నిర్ణయం తీసుకుంది. అయితే అక్కడ ఊరట లభిస్తుందో లేదో తెలియదు కా నీ, ఏ కోషంలో చూసినా ఈ కేసులో సీబీఐ రంగం లోకి దిగడం ఖాయం అని న్యాయ నిపుణులు చెబుతున్నారు.

ఆ ఇద్దరు ఐపీఎస్‌లకూ తప్పని విచారణ?
అదే జరిగితే, హైదరాబాద్‌, సైబరా బాద్‌ కమిష నర్లు కూడా ఇబ్బందులు న్యాయ పరమైన చిక్కుల్లో పడనున్నారు. ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లు-గా చేస్తూ రాజకీయ కుట్రలు చేస్తున్నారని స్టీఫెన్‌పై బీజేపీ నేతలు ఇప్పటికే తీవ్రమైన ఆరోపణలు చేశారు. సిట్‌కు నేతృ త్వం వహించిన సీవీ.ఆనంద్‌ను కూడా సీబీఐ ప్రశ్నించే అవకాశం లేకపోలేదు. న్యాయ నిపుణుల అంచనా ప్రకారం సీబీఐ విచారణలో ముం దుగా నలుగురు ఎమ్మెల్యేలనూ ప్రశ్నించే అవకాశం ఉంది. ఈ వ్యవ హారంలో అసలేం జరుగుతుందనే అంశంపై త్వరలోనే క్లారిటీ- వచ్చే అవకాశం ఉంది. సీబీఐ విచారణ మొదలైతే అది కచ్చితంగా బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగానే ఉంటు-ందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement