ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్‌రెడ్డి భూవివాదంలో చిక్కుకున్నారు. కాప్రాలోని సర్వే నెంబర్ 152లో 90 ఎకరాల భూమికి సంబంధించిన వివాదంలో ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి తలదూర్చినట్లు ఆరోపణలొచ్చాయి. ఎమ్మెల్యే తమ దగ్గర డబ్బులు డిమాండ్ చేశారంటూ మేకల శ్రీనివాస్ యాదవ్ కోర్టును ఆశ్రయించారు. ఈ వివాదంలో కోర్టు ఆదేశాలతో సుభాష్ రెడ్డిపై కేసు నమోదు చేశారు జవహర్‌నగర్ పోలీసులు. ఆయనతో పాటు కాప్రా ఎమ్మార్వో గౌతమ్‌కుమార్‌పై కూడా కేసు నమోదైంది. 120బీ,166ఏ, 167, 168, 170, 171, 447, 468, 471, 307, 506 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
కాగా, గత కొంత కాలంగా టీఆర్ఎస్ పార్టీ నేతలపై భూవివాదాల ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికే మాజీమంత్రి ఈటెల రాజేందర్ భూ వివాదంలో చిక్కుకున్నారు. దీంతో ఆయనను మంత్రివర్గం నుంచి సీఎం కేసీఆర్ బర్తరఫ్ చేశారు. ఆయనపై విచారణకు ఆదేశించారు. ఇప్పుడు ఉప్పల్ ఎమ్మెల్యేపై ఎలాంటి చర్యలు తీసుకుంటారోననే చర్చ సర్వత్ర జరుగుతోంది.