గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేసు నమోదైంది. ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించారనే ఆరోపణలపై సుల్తాన్ బజార్ పోలీసులు ఎమ్మెల్యే రాజా సింగ్‌పై సుమోటోగా ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. సుల్తాన్ బజార్ పోలీసులు. శ్రీరామనవమి శోభాయాత్రలో భాగంగా హనుమాన్ వ్యాయామశాల వద్ద స్పీచ్ ఇస్తూ ఎన్నికల నియమావళి ఉల్లఘించినట్లు ఎస్‌ఐ మధుసుధన్ తెలిపారు.
ఐపీసీ 188, 290 రెడ్ విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ నెల 18వ తేదీనే పోలీసులు కేసు నమోదు చేయగా.. తాజాగా విషయం వెలుగులోకి వచ్చింది. ఈ నెల 17న శ్రీరామనవమి సందర్భంగా అనుమతి లేకుండా ర్యాలీ తీయడంపైన రాజా సింగ్‌పై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నగరంలో శాంతిభద్రతల దృష్ట్యా రాజా సింగ్ ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించారు. పోలీసులు పర్మిషన్ ఇవ్వనప్పటికీ అభిమానులు, అనుచరులతో రాజా సింగ్ భారీ ర్యాలీ తీశారు. ఈ ఘటనపై సీరియస్ అయిన అప్జల్ గంజ్ పోలీసులు రాజా సింగ్‌పై సుమోటోగా కేసు నమోదు చేశారు.