Saturday, November 23, 2024

TG | నకిలీ విలేకరిపై కేసు నమోదు…

జన్నారం,(ప్రభ న్యూస్): మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలోని జయరాణి ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ కరస్పాండెంట్ శ్రీరాముల మధుసూదన్ కు…. ప్రజాతంత్ర స్టాఫ్ రిపోర్టర్ ని అంటూ డబ్బులు డిమాండ్ చేసిన రత్నం తిరుపతిపై కేసు నమోదు చేసినట్లు స్థానిక ఎస్సై గుండేటి రాజవర్ధన్ తెలిపారు.

కరస్పాండెంట్ మధుసూదన్ కు ఈ నెల 11న ఫోన్ చేసి… ప్రజాతంత్ర స్టాఫ్ రిపోర్టర్ అని, వార్షికోత్సవాని కోసం ముందుగా రూ.5000. ఇవ్వాలని, చివరకు రూ.4వేలు ఇవ్వాలని, లేకుంటే పాఠశాలకు ఇబ్బందులు తప్పవని బెదిరించారని తెలిపారు. మధుసూదన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు తిరుపతిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

నకిలీ విలేఖర్లపై చర్య తీసుకోవాలి…

ఈ మధ్యకాలంలో నకిలీ విలేకర్ల చలామణి ఎక్కువైందని, విలేకర్లమంటూ అధికార్లను, వ్యాపారులను, నేతలకు ఫోన్ లు చేసి అక్రమ వసూళ్లు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్, యుడబ్ల్యూజే (ఐజేయు) ఆధ్వర్యంలో స్థానిక ఎస్ఐ గుండేటి రాజవర్దన్ కు సోమవారం సాయంత్రం ఫిర్యాదు చేశారు.

ఈనెల 11న మండలంలోని జయరాణి ఇంగ్లీష్ మీడియం పాఠశాల కరస్పాండెంట్ శ్రీరాముల మధుసూదన్ కు మంచిర్యాల జిల్లా ప్రజాతంత్ర స్టాఫ్ రిపోర్టర్ తిరుపతిని అంటూ ఫోన్ చేసి వార్షికోత్సవం ఉందని డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అటువంటి నకిలీ విలేకరిపై చర్య తీసుకోవాలని, నకిలీ విలేకరులు పలు వాహనాలకు ప్రెస్ స్టిక్కర్లు పెట్టుకొని చలామణి అవుతున్నారని, అలాంటి వారిపై పోలీసు అధికారులు చర్యలు తీసుకొని, అక్రిడేషన్ ఉన్న విలేకరులకు ప్రెస్ స్టిక్కర్లు ఇవ్వాలని ఆ ఫిర్యాదులో పేర్కోన్నారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ మండలాధ్యక్షుడు చిలువేరు నర్సయ్య,ప్రధాన కార్యదర్శి జి.లింగన్న,ఉపాధ్యక్షులు ఎంబడి మల్లేశం,కోశాధికారి ఎస్.చంద్రశేఖర్,సభ్యులు గుండ పవన్ కుమార్,జి.సత్యం,ఐ.నర్సయ్య,సతీష్,తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement