కాంగ్రెస్ సీనియర్ నేత అద్దంకి దయాకర్ పై నిర్మల్లో కేసు నమోదైంది. ఆదిలాబాద్ సభలో శ్రీరాముడు, హిందువులపై కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ వివాదస్పద వ్యాఖ్యలు చేయడంతో ఆయనపై బిజెపి నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిర్మల్ పోలీస్ స్టేషన్లో ఐపిసి సెక్షన్ 504, 505/2 కింద అతడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈనెల 5న జిల్లా నిర్వహించిన కాంగ్రెస్ జన జాతర బహిరంగ సభలో అద్దంకి దయాకర్ హిందూ దేవతలు రాముడు, సీతపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బిజెపి, ఇతర హిందువులు రాముని వారసులు అని చెప్పుకుంటున్నారని, మీరు ఏవిదంగా రాముడి వారసులు అవుతారని ప్రశ్నించారు. రాముడు మీకు చిన్నాయన, సీత మీకు చిన్నమ్మన అని అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో హిందూ సంఘాలు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ వ్యాఖ్యలపై బీజేపీ దళిత మోర్చా జిల్లా అధ్యక్షుడు రాచకొండ సాగర్ పీఎస్ లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.