Tuesday, November 19, 2024

TS: బీఆర్ఎస్ నేతలపై కేసు నమోదు..

353, 448 ఐపిసి సెక్షన్ల నమోదు
నాంపల్లి కోర్టుకు తరలింపు

హైదరాబాద్, ఆంధ్రప్రభ : ఎమ్మెల్యే పోచారం ఇంటి వద్ద ఆందోళన చేపట్టిన మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తో పాటు 12మంది బీఆర్ఎస్ నేతలపై బంజార హిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. శుక్రవారం బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరిక కార్యక్రమం నిర్వహిస్తున్న సమయంలో చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తో పాటు పలువురు మాజీ కార్పొరేషన్ చైర్మన్ లు, నాయకులు పోచారం ఇంట్లోకి వెళ్ళేందుకు ప్రయత్నించగా పోలీసులు ఆడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు బాల్క సుమన్ తో పాటు బీఆర్ఎస్ నాయకులు అందరిని పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. సుమన్ తో పాటు12మందిపై 353, 448 రెడ్ విత్ 34 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి నాంపల్లి కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరుపరచారు. ఆరెస్ట్ అయిన వారిలో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, మన్నే గోవర్ధన్ రెడ్డి, కె.వాసుదేవరెడ్డి, గెల్లు శ్రీనివాస్ యాదవ్, ఆంజనేయ గౌడ్, కడారి స్వామి, తుంగ బాలు, డి.రాజు, కే జంగయ్య, వరికుప్పల వాసు, చట్టరి దశరథ్, దుడిమెట్ల బాలరాజు ఉన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement