Wednesday, November 20, 2024

సింగరేణి కాలనీ వాసులపై కేసు నమోదు

సైదాబాద్ లో ఆరేళ్ల చిన్నారి హత్యాచారం ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సింగరేణి కాలనీ స్థానికులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 10న తమ విధులకు ఆటంకం కలిగించేలా ప్రవర్తించిన పలువురిపై కేసులు నమోదు చేశారు. చిన్నారి మృతదేహాన్ని తరలించే సమయంలో స్థానికులు పోలీసులను అడ్డుకున్నారు. ఆరోజు విధుల్లో ఉన్న పోలీసులపై స్థానికులు రాళ్లు రువ్వారు. ఈ క్రమంలో పలువురు మహిళా పోలీస్ సిబ్బందికి గాయాలయ్యాయి. దీంతో ఈ ఘటనపై సైదాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు.

కాగా, సైదాబాద్ ఘటన కేసులో నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే, నిందితుడు రాజు మృతిపై జ్యుడీషియల్ విచారణకు హైకోర్టు ఆదేశించింది. రాజుది ఆత్మహత్య కాదని.. కస్టోడియల్ మృతిగా అనుమానం ఉందని పౌర హక్కుల సంఘం అధ్యక్షుడు లక్ష్మణ్ పిల్ హైకోర్టులో లంచ్ మోషన్ పిల్ దాఖలు చేశారు. దీని​పై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. ఘటనపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని మేజిస్ట్రేట్ కు హైకోర్టు ఆదేశించింది. వరంగల్ 3వ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కు విచారణ బాధ్యతలు అప్పగించింది. నాలుగు వారాల్లో సీల్డు కవర్ లో నివేదిక సమర్పించాలని ఆదేశించింది.

ఇది కూడా చదవండిః రాజు మృతిపై జ్యుడీషియల్ విచారణకు హైకోర్టు ఆదేశం

Advertisement

తాజా వార్తలు

Advertisement