హైదరాబాద్: ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది.. ఈ కేసులో కేంద్ర ప్రభుత్వ సంస్థ ఈడీ నేడు ఎంటరైంది..ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు తెలుపాలంటూ తెలంగాణ ఏసీబీకి ఈడీ అధికారులు లేఖ రాశారు. కేటీఆర్ పై నమోదైన కేసు వివరాలను ఇవ్వాలని ఏసీబీని ఈడీ కోరింది. కేటీఆర్ పై నమోదైన ఎఫ్ఐఆర్ కాపీతో పాటు హెచ్ఎండీఏ అకౌంట్ నుంచి నగదు బదిలీకి సంబంధించి ఈడీ వివరాలు కోరింది. ఇక కెటిఆర్ పై కేసు దాఖలు చేసిన దాన కిషోర్ కాపీ కూడా పంపాలని ఈడీని కోరింది. ఎంత మొత్తం బదిలీ చేశారో, ఏఏ తేదీల్లో నగదు బదిలీ జరిగిందో పూర్తి వివరాలను ఇవ్వాలని ఏసీబీకి ఈడీ స్పష్టం చేసింది. .
Advertisement
తాజా వార్తలు
Advertisement