Sunday, January 19, 2025

Nirmal | జాతీయ రహదారిపై కారు బోల్తా… భార్యాభర్తలు మృతి

నిర్మల్ ప్రతినిధి, (ఆంధ్రప్రభ) : మామడ మండలం బూరుగుపల్లి తాండ్ర జాతీయ రహదారిపై శనివారం రాత్రి కారు ప్రమాదం జరిగింది. కారు బోల్తా పడి ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.

వివరాల ప్రకారం..
మధ్యప్రదేశ్ నుంచి శ్రీశైలం వెళ్తున్న కారు… రోడ్డుకు అడ్డుగా వ‌చ్చిన కోతిని తప్పించే క్రమంలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు భార్యాభర్తలు మృతి చెందగా, మరో ముగ్గురికి గాయాలయ్యాయి. ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్న పోలీసులు… క్షతగాత్రులను నిర్మల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement