Saturday, November 23, 2024

Breaking | హైద‌రాబాద్ ఔట‌ర్‌పై కారు యాక్సిడెంట్‌.. ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో..

రంగారెడ్డి జిల్లా రాజేంద్ర‌న‌గ‌ర్ ఔట‌ర్ రింగ్‌రోడ్డుపై యాక్సిడెంట్ జ‌రిగింది. ఓఆర్ ఆర్ మీద తెలంగాణ‌ పోలీస్ అకాడ‌మీ (టీఎస్‌పీఏ) స‌మీపంలో ఎమ‌ర్జెన్సీ లేన్‌లో ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. అత్యంత వేగంతో వ‌చ్చిన కారు బ‌లంగా లారీని ఢీకొట్ట‌డంతో కారు సగం వ‌ర‌కు దూసుకుని పోయింది. దీంతో కారు న‌డుపుతున్న డ్రైవ‌ర్ అక్క‌డిక‌క్క‌డే చ‌నిపోయాడు.

లారీ మ‌ధ్య‌లోకి కారు దూసుకెళ్ల‌డంతో కారులోనే మృత‌దేహం ఇరుక్క‌పోయింది. కాగా, ఓఆర్ ఆర్ సిబ్బంది, ట్రాఫిక్ పోలీసులు క్రేన్ సహాయంతో కారును బయటకు తీశారు. ఇక‌.. హైద‌రాబాద్‌లోని గచ్చిబౌలి నుండి శంషాబాద్ వైపు వెళ్తుండగా ఈ ప్ర‌మాదం జ‌రిగిన‌ట్టు పోలీసులు చెబుతున్నారు. మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణంగా గుర్తించారు. మృతుడు క‌ర్నాట‌కుకు చెందిన రేవన్ సిద్ధాగా గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు రాజేంద్రనగర్ పోలీసులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement