Saturday, November 23, 2024

ఆన్‌లైన్ క్లాసులు రద్దు.. స్టడీ సెంటర్లలతో ప్రత్యక్ష శిక్షణ..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: కొవిడ్‌ నేపథ్యంలో మూతపడిన విద్యాసంస్థలన్ని ఇప్పుడు తెరుచు కోవడంతో స్టడీ సర్కిళ్లను తెరిచి ప్రత్యక్ష శిక్షణ తరగతులు నిర్వహించాలని సాంఘిక సంక్షేమ శాఖలు నిర్ణయం తీసుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం వివిధ సంక్షేమ శాఖలకు చెందిన స్టడీ సర్కిళ్ల ద్వారా ఉచితంగా కోచింగ్‌ ఇవ్వనుండటంతో పేద వర్గాలకు చెందిన వారు ఎక్కువగా వీటిపైనే ఆధారపడు తుంటారు. ఈ క్రమంలో త్వరలోనే జరగనున్న ఐబీపీఎస్‌ పరీక్షలతో పాటు ఇతర ఉద్యోగ ప్రకటనలకు తగినట్లుగా శిక్షణ ఇవ్వనున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖల పరిధిలో హైదరాబాద్‌లో మూడు ప్రధాన స్టడీ సర్కిళ్లు ఉన్నాయి. వీటికి అను బంధంగా ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో కూడా సంక్షేమ శాఖల వారిగా ఒక్కో స్టడీ సర్కిల్‌ను నిర్వ హిస్తున్నాయి.

జాతీయ బ్యాంకుల్లో పెద్ద ఎత్తున ఉద్యోగ ఖాళీల భర్తీకి ఇటీవలనే ఐబీపీఎస్‌ ప్రకటన విడుదల చేసింది. ఇందుకు సంబంధించి శిక్షణ తరగతులను ప్రారం భించేందుకు చర్యలు చేపట్టారు. రైల్వేలో ఉద్యోగాలకు సైతం నోటిఫికేషన్లు విడతల వారిగా విడుదల చేస్తున్నందున నిరుద్యోగులు లక్షల్లో దరఖాస్తులు చేసుకునే అవకాశం ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీతో పాటు మైనార్టీ వర్గాలకు చెందిన వారు స్టడీ సెంటర్లలతో శిక్షణ కోసం సిద్ధమవుతున్నారు. దీంతో స్టడీ సర్కిళ్లను పూర్తి స్థాయిలో తెరిచి ప్రత్యక్ష తరగతుల ద్వారా శిక్షణ ఇచ్చేందుకు అధికారులు సిద్ధ మవుతున్నారు. ఇప్పటికే బీసీ స్టడీ సర్కిల్‌ పరిధిలో ఎస్సై, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు సంబంధించి రాతపరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 11 స్టడీ సర్కిళ్ల ద్వారా ప్రత్యక్ష శిక్షణను ప్రారంభించింది.

ఈ మేరకు దరఖాస్తులను స్వీకరణకూడా పూర్తి చేసింది. సివిల్స్‌కు సిద్ధమవుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు ఆన్‌లైన్‌లో తరగతులు నిర్వహిస్తుండగా, ప్రత్యక్ష శిక్షణ కోసం అభ్యర్థులు డిమాండ్‌ చేస్తున్నారు. బీసీ స్టడీ సర్కిల్‌ ద్వారా సివిల్స్‌-2021 ప్రిలిమ్స్‌లో పాసైన బీసీ యువతకు మొయిన్స్‌కు అవసరమైన కోచింగ్‌ ఇచ్చేందుకు సిద్ధం కావడంతో పాటు, ఈ నెల 15లోగా దరఖాస్తులు చేసుకోవాలని సూచించింది. అందుకు ఈ నెలలోనే ప్రత్యక్ష తరగతులు నిర్వహించాలని వివిధ స్టడీ సర్కిళ్లకు సంబంధించిన ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement