హైదరాబాద్‌లో ఫిబ్రవరి 10న నిర్వాహించాల్సిన ఫార్ములా-ఈరేస్ రద్దు రద్దయింది. ఈ విషయాన్ని ఎఫ్ఐ ఫార్ములా-ఈ వెల్లడించింది. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. గతంలో చేసుకున్న ఒప్పందం ఉల్లంఘనపై మున్సిపల్ శాఖకు నోటీస్ ఇస్తామని ఫార్ములా ఈ రేస్ నిర్వాహకులు చెప్పారు.
ఫార్ములా ఈ రేస్ రద్దుపై ఎమ్మెల్యే కేటీఆర్ ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. ఇది నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న దుర్మార్గమైన నిర్ణయమని పేర్కొన్నారు. ఇలాంటి ఈవెంట్స్ ప్రపంచ వ్యాప్తంగా హైదరాబాద్‌తో పాటు దేశం బ్రాండ్ ఇమేజ్‌ను పెంచుతాయన్నారు. భారతదేశానికి మొదటిసారిగా ఫార్ములా ఇ-ప్రిక్స్‌ని తీసుకురావడానికి తాము చాలా కృషి చేశామని కేటీఆర్ పేర్కొన్నారు. బజ్‌వర్డ్‌గా మారిన ప్రపంచంలో హైదరాబాద్‌ను ఆకర్షణీయమైన పెట్టుబడి కేంద్రంగా మార్చడానికి ఎంతో కష్టపడ్డామన్నారు.
ఈవీ ఔత్సాహికులు, తయారీదారులు స్టార్టప్‌లను ఆకర్షిస్తూ ఒక వారం పాటు ఈవీ సమ్మిట్‌ను నిర్వహించడానికి కేసీఆర్ ప్రభుత్వం ఫార్ములా ఈ రేస్‌ను ఉపయోగించుకుందని వెల్లడించారు. ఫిబ్రవరిలో జరగాల్సిన ఈ-రేసింగ్ కోసం తెలంగాణ ప్రజలు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారన్నారు. ఈ తరుణంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రేసింగ్ రద్దు చేయడం సమంజసం కాదన్నారు. ఇలాంటి చర్యలు చాలా నష్టం కలిగిస్తాయంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ ఫైర్ అయ్యారు.