తెలుగు అకాడమీ డిపాజిట్ కేసులో మరో కీలక పరిణాయం చోటుచేసుకుంది. తెలుగు అకాడమీ అకౌంట్స్ అధికారి రమేశ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. మోసానికి పాల్పడిన చందానగర్ కెనరా బ్యాంక్ మేనేజర్ సాధనను పోలీసులు అరెస్టు చేశారు. తెలుగు అకాడమీ స్కాంలో ఇప్పటి వరకు తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నారు. మోసానికి పాల్పడిన ముగ్గురు బ్యాంక్ ఏజెంట్లు వెంకట్, రాజ్‌కుమార్, సాయిని సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. జనవరి నుంచే ఫిక్స్‌డ్ డిపాజిట్లను ముఠా సభ్యులు మళ్లించారు. యూబీఐ మేనేజర్ మస్తాన్ వలితో కుమ్మకైన నిందితులు తెలుగు అకాడమీ డిపాజిట్లు కాజేసినట్లు పోలీసులు తేల్చారు. మూడు బ్యాంకుల నుంచి కోట్లు డ్రా చేసిన నిందితులు.. ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ వరకు స్కాంకు పాల్పడినట్టు గుర్తించారు. ఎఫ్‌డీలను అగ్రసేన్ బ్యాంకులోని ఏపీ మర్చంటైల్ సొసైటీకి మళ్లించారు. కెనరా బ్యాంకులోని రూ.10 కోట్ల డిపాజిట్లను మళ్లించారు.
ఇది కూడా చదవండి: అమరావతికి వెయ్యి కోట్లు వస్తాయా?