అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడేందుకు యత్నించగా.. సభ జరుగుతుండగా నిబంధనలు అందుకు అనుమతించవంటూ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో.. అక్కడే రోడ్డు మీదే బైఠాయించి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు నిరసన తెలిపారు. ఈ సందర్భాన్ని ప్రస్తావిస్తూ తాజాగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు.
మాకు కొట్లాట కొత్తేమీ కాదు! గతంలో ఇదే రోడ్ల మీద ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉద్యమం చేసి.. రాష్ట్రాన్ని సాధించిన చరిత్ర మా బీఆర్ఎస్ పార్టీకి ఉంది. జై తెలంగాణ అంటూ పోస్ట్ చేశారాయన. అసెంబ్లీలో నిన్నటి నిరసన.. తెలంగాణఉద్యమ కాలం నాటి రోజుల్ని గుర్తు చేసిందంటూ సందేశం ఉంచారు.