Friday, November 22, 2024

Campaign in Bodhan – కాంగ్రెస్ కు ఓటు వేస్తే మ‌న వేలితో మ‌న కంటిని పొడుచుకున్న‌ట్లే ….కెసిఆర్

బోధ‌న్ – దుర్మార్గ కాంగ్రెస్ పార్టీని మట్టి కరిపించక పోతే… మన వేలుతో మన కంటిని పొడుచుకుందామా? తెలంగాణకు పెద్ద ప్రమాదాన్ని కొని తెచ్చుకుందామా? ఒక్కసారి ఆలోచించండి, ప్రజల హితం కోరుకునే పార్టీ ఏది? నాశనం చేసే పార్టీ ఏది? ఆలోచించండి అని తెలంగాణ సీఎం కే.చంద్రశేఖర్ రావు ప్రజలను ప్రశ్నించారు.
నిజామాబాద్ జిల్లా బోధన్లో బీఆర్ఎస్ ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడారు. ఈ సభకు బోధన్ జనం పోటెత్తారు. ఈలలు కేరింతలతో తుళ్లిపోయారు. ఒకానొక దశలో కేసీఆర్ అసహనం వ్యక్తం చేశారు. గడిబిడి వద్దని కార్యకర్తలను సముదాయించారు.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, భారత దేశంలో రాజకీయ పరిణితి రాలేదని, ఎన్నికలు రాగానే.. కులాల పేరిట, మతాల పేరిట కొట్లాటలు, ఆరోపణులు, అభాండాలు, జూటా వాగ్డానాలు, గడబిడ, పిచ్చి పిచ్చి ప్రేలాపనలు పెరిగిపోయాయి. ఎక్కడైతే రాజకీయం పరిణితి చెందుతుందో అక్కడ అభివృద్ధి ఖాయమని కేసీఆర్ వివరించారు.


50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఏమి జరిగింది? పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఏం జరిగిందో గుర్తించాలి. రైతుల సంక్షేమం కోపం వ్యవసాయాన్ని స్థిరీ కరించటానికి తమ ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపట్టిందని, రైతు బంధు, రైతు బీమా, ధరణి పథకాలతో మంచి కార్యక్రమాలను చేపడుతుంటే, కాంగ్రెస్ నాయకులు ఈ పథకాలన్నీ దుబారా, వృథా అని చెబుతున్నారని, ధరణి లేకుండా రైతు పథకాలు ఎలా అమలు జరుగుతాయని కేసీఆర్ ప్రశ్నించారు.
ఇరవై నాలుగు గంటలు ఉచిత కరెంటు వద్దంట? రైతు బంధు వద్దంట, ధరణిని బంగళాఖాతంలో కలిపేస్తరంట… మరి ధరణిని బంగాళాఖాతంలో కలిపితే.. రైతులు ఆరేబియా సముద్రంలో కలవాల్సిందే, అందుకే దుర్మార్గ కాంగ్రెస్ను గెలిపిస్తే, తెలంగాణాకు ప్రమాదమే అని కేసీఆర్ వివరించారు. బోధన్లో షకీల్ భాయిని గెలిపిస్తే రాష్ర్టంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడుతుందని, తాము అధికారంలో వస్తే నిజామాబాద్ జిల్లాను సస్యశ్యామలం చేస్తామన్నారు. నిజాంసాగర్లో 365 రోజులూ నిండుకుండలా ఉంచుతామన్నారు. సింగూరు ప్రాజెక్టు, కాళేశ్వరం ఎత్తిపోతల నుంచి సమృద్ధిగా సాగునీరు లభిస్తుందన్నారు.


తెలంగాణలో రైతుల ఆనందాన్ని గమనించిన మహారాష్ర్ట రైతులు తమ జిల్లాను తెలంగాణలో కలపాలని కోరుతున్నారని కేసీఆర్ తెలిపారు. ఇప్పుడు పోటీలో ఉన్న సుదర్శన్ రెడ్డి ఇరిగేషన్ మంత్రిగా పని చేశారని, ఏనాడు బోధన్ రైతుల కష్టాలను పట్టించుకోలేదన్నారు. కాలువల్లో నీరు వదలాలని ఇక్కడి రైతులు ఎన్నో సార్లు ఆందోళనలు చేశారని గుర్తు చేశారు. సుదర్శన్ రెడ్డి మంత్రిగా ఏనాడు ఒక్క పైసా తీసుకురాలేదు, రైతుల బాధను పట్టించుకోలేదు. కానీ షకీల్ భాయి రూ.72 కోట్ల మేరకు నిధులు మంజూరు చేయించుకుని చెక్డ్యామ్లు, డిస్ర్టిబ్యూటరీ కెనాల్స్ నిర్మాణానికి కృషి చేశారని కేసీఆర్ వివరించారు.


కాంగ్రెస్ పార్టీ వస్తే.. ధరణి పోయి రైతు నెత్తిపై దిబ్బ వస్తాదని, లంచాల రాజ్యం వస్తుందని, పైరవీకారులు, దళారులు రాజ్యం ఏలుతారని కేసీఆర్ హెచ్చరంచారు. ఒక్కసారి ఆలోచించండి, ఎవరో చెప్పిన మాటలతో ఓట్లు వేస్తే ఆగం అవుతాం, ఐదేళ్లు మాట్లాడలేం, రైతు బంధు పోయినా, కరెంటు లేకపోయినా, ధరణి ఎత్తివేస్తే వచ్చే కష్టాలను ప్రశ్నించలేం, కనీసం ఈ కేసీఆర్ కూడా మాట్లడలేదు. అందుకే తెలంగాణను దెబ్బతీసిన కాంగ్రెస్కు ఒక్క ఓటు కూడా వేయొద్దు అని కేసీఆర్ పిలుపునిచ్చారు..

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement