హైదరాబాద్ – నేడు అసెంబ్లీ సమావేశాలలో కాగ్ నివేదికను ప్రవేశపెట్టారు.. సభ ప్రారంభమైన వెంటనే స్పీకర్ గడ్డంప్రసాద్ మాట్లాడుతూ… సభ నడుస్తుండగా మీడియా పాయింట్లో ఎవరూ మాట్లాడకూడదని స్పష్టం చేశారు. బ్రేక్ టైంలో మాత్రమే మీడియా పాయింట్‌లో సభ్యులు మాట్లాడాలని స్పీకర్ ఆదేశించారు. అనంతరం ఉభయ సభల్లో కాగ్ నివేదికను ప్రవేశపెట్టింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాగ్ రిపోర్ట్‌ను సర్కార్ సభలో పెట్టింది.
ప్రాణహిత ప్రాజెక్టులో ఎలాంటి పురోగతి లేదు దీనికోసం కేటాయించిన 878 కోట్లు నిష్ఫలంగా మారిపోయాయన్నారు. రీఇంజనీరింగ్ పేరుతో డబ్బులు వృధా చేశారన్నారు. ప్రాణహిత మీద..2022 మార్చి నాటికి..1727 కోట్లు కాగా.. కాళేశ్వరంపై 86,788 కోట్లు ఖర్చు.. కాళేశ్వరంపై అంతరాష్ట్ర సమస్యలు.. నిల్వ సామర్థ్యం.. సౌకర్యంపై సరైన అధ్యయనం చేయలేదన్నారు. అస్తవ్యస్తంగా.. పనులు ప్రారంభించారని తెలిపారు. మహారాష్ట్ర లో ముంపు సమస్యను కాగ్ ఎత్తిచూపించింది. ప్రాజెక్టు వ్యయం 122 శాతం పెరిగింది కానీ.. ఆయకట్టు 52 శాతం మాత్రమే పెరిగిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వడ్డీతో సహా 1,47,427 కోట్లకు పెరిగిందన్నారు. ప్రాణహిత ప్రాజెక్టు డీపీఆర్ లేదన్నారు. ప్రాజెక్టు పనుల్లో మార్పుల కారణంగా కొన్ని పనులు నిరార్థకం అయ్యాయి.. ఫలితంగా 767 కోట్లు నష్టం జరిగిందన్నారు. కాళేశ్వరం డీపీఆర్ తయారు చేసిన వ్యాప్కోస్ పని తీరులో లోపాలు ఉన్నాయన్నారు. రి ఇంజనీరింగ్ పనులు కూడా అదే సంస్థకు అప్పగించారని తెలిపారు. 2018లో కాళేశ్వరం డీపీఆర్ ని కేంద్ర జలసంఘం ఆమోదించక ముందే 17 పనులు.. 25049 కోట్లకు అప్పగించారన్నారు.
డీపీఆర్ తరువాత కూడా ప్రాజెక్టు పనుల్లో మార్పులు చేశారని తెలిపారు. తొలుత 2టీఎంసీ ఎత్తిపోతలు ప్రతిపాదించి..అవసరం లేకున్న 3టీఎంసీలకు ప్రతిపాదన పెంచారని తెలిపారు. దీంతో 28.151 కోట్ల అదనపు వ్యయం. అంచనాలు పాత ధరలతో తయారు చేసి.. పెరిగిన ధరలు మోతాన్ని చేర్చకుండ.. డీపీఆర్ లో ప్రాజెక్టు విలువ తక్కువ చేసి చూపెట్టారన్నారు. ఆ తరవాత మార్పులతో ప్రాజెక్టు విలువ 63,352 కోట్ల నుండి 1లక్ష 2,267 కోట్లకు పెరిగిందన్నారు. భూసేకరణ పునరావాసం మిగిలి ఉందన్నారు. కేంద్ర జలసాంగ్ కి ఇచ్చిన రిపోర్టులో 81,911 కోట్లు ఉందని తెలిపారు. 1,47,427 కోట్లకీ మించిపోయే అవకాశం ఉందన్నారు. కాళేశ్వరంపై ఒక్కో ఎకరాకు అయ్యే మూలధనం వ్యయం 6 లక్షల 42 వేళకు తేలింది. ప్రాజెక్టుతో వచ్చే లాభాలు ఎక్జువ చూపి.. వార్షిక వ్యయం తక్కువ చూపారన్నారు. ఒక్క టీఎంసీ తో 17,668 ఎకరాల ఆయకట్టు వస్తుందని అంచనా వేశారు. ఇతర ప్రాజెక్టులతో పోల్చితే 10వేల ఏకరాలకే సరిపోదన్నారు.
కాళేశ్వరం నిర్వహణకు 10వేల కోట్లు పడుతోందని, కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయం అంచనాకి మొత్తానికి అనుమతి ఇవ్వలేదన్నారు. ఒక్కో పనికి అనుమతి ఇస్తూ పోయిందని, కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పోరేషన్ పేరుతో అప్పులు తెచ్చిందన్నారు. 87,449 కోట్ల రుణాలు తెచ్చింది ప్రభుత్వం అని తెలిపారు. బడ్జెట్ నుండి వచ్చింది కేవలం 27శాతం మాత్రమే కేటాయింపు.. ఖర్చు ఉందన్నారు. కాళేశ్వరంపై ఆదాయం లేదు కాబట్టి రుణాలు చెల్లింపు కష్టం అని కాగ్ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో బడ్జెట్ పై భారం పడుతుందన్నారు. 2020..21 లోనే రుణాల చెల్లింపు ప్రారంభం కావాల్సి ఉందన్నారు. కానీ 9 ఆగ్రిమెంట్ లను వాయిదా వేయాలని కోరిందన్నారు. దీంతో వడ్డీల భారం 8,182 కోట్ల అదనపు వడ్డీ భారం పడిందన్నారు. కాళేశ్వరం కోసం తెచ్చిన రుణాలను.. 1,690 కోట్లు మళ్లించారని తెలిపారు. అందనంగా 587 కోట్లు వడ్డీ పడిందన్నారు. ప్రతి ఏటా.. 14 462 కోట్లు రుణాల చెల్లింపు.. వడ్డీకి కేటాయించాల్సి ఉందని, కాళేశ్వరం పనుల్లో 56 పనుల్లో 13 పూర్తి అయ్యాయన్నారు.