తెలంగాణలో పెండింగ్లో ఉన్న పోడు భూముల సమస్యల పరిష్కారానికి ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది. మంత్రివర్గం ఏర్పాటైన తర్వాత తొలిసారి ఈ భేటీ జరుగుతోంది. మంత్రి సత్యవతి రాఠోడ్ అధ్యక్షతన ఏర్పాటైన ఈ భేటీలో మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, జగదీశ్ రెడ్డి, పువ్వాడ అజయ్ హాజరయ్యారు.
ఈనెల 16న జరిగిన మంత్రి మండలి సమావేశంలో పోడు భూముల సమస్యలపై పూర్తి అవగాహన, పరిష్కారాల అన్వేషణ, సూచనల కోసం సీఎం కేసీఆర్ కేబినెట్ సబ్ కమిటీని నియమించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు మంత్రివర్గ ఉపసంఘం సమావేశమయింది. ఆగస్టులో జరిగిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవం రోజున ముఖ్యమంత్రి కేసీఆర్.. పోడు భూములకు శాశ్వత పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు.
ఇది కూడా చదవండిః కార్పొరేషన్ లో కోల్డ్ వార్.. కాకినాడ మేయర్ పై అవిశ్వాసం