తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ సమావేశం అసెంబ్లీ కమిటీ హాల్ లో నేడు నిర్వహించారు…. ఈ సమావేశంలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది .కాగా, మధ్యాహ్నం 12 గంటలకు 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క రాష్ట్ర బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశ పెడతారు. మండలిలో శ్రీధర్ బాబు బడ్జెట్ ను ప్రవేశ పెడతారు. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో బడ్జెట్ ఎలా ఉండబోతోందనే ఆసక్తి సర్వత్ర నెలకొంది..
కాగా బడ్జెట్ ప్రతిపాదనలతో భట్టి సమావేశంలో పాల్గొన్నారు.. బడ్జెట్ ప్రతిపాదనలపై చర్చజరిగిన అనంతరం క్యాబినేట్ దానిని ఆమోదించింది..
Telangana బడ్జెట్ కు క్యాబినేట్ ఆమోదం…
Advertisement
తాజా వార్తలు
Advertisement