పల్లా రాజీనామాతో ఉప ఎన్నిక
మే 2 నుంచి నామినేషన్స్
తొమ్మిది వరకు స్వీకరణ
మే 27న పోలింగ్
హైదరాబాద్ : వరంగల్ – ఖమ్మం – నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించిన షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం నేడు విడుదల చేసింది. ఈ ఉప ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ మే 2వ తేదీన జారీ కానుంది. మే 2 నుంచి 9వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. 10వ తేదీన నామినేషన్లను పరిశీలించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ మే 13. ఈ ఉప ఎన్నికకు మే 27వ తేదీన పోలింగ్ నిర్వహించనున్నారు.
27న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. జూన్ 5వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. వరంగల్ – ఖమ్మం – నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఉన్న పల్లా రాజేశ్వర్ రెడ్డి.. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. దీంతో ఈ పట్టభద్రుల నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది.