Friday, November 22, 2024

By Election – మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక … కొనసాగుతున్న పోలింగ్‌

హైదరాబాద్‌: మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక పోలింగ్‌ ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓటింగ్‌ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. మొత్తం 1,439 మంది ప్రజాప్రతినిధులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరికోసం ఉమ్మడి జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో 10 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కొడంగల్‌లో, మంత్రి జూపల్లి కృష్ణారవు కొల్లాపూర్‌లో ఓటేయనున్నారు. ఏప్రిల్‌ 2న ఓట్లను లెక్కిస్తారు. ఎమ్మెల్సీగా ఉన్న కసిరెడ్డి నారాయణరెడ్డి రాజీనామా చేసి కల్వకుర్తి ఎమ్మెల్యేగా గెలవడంతో ఈ ఉపఎన్నిక అనివార్యమైంది. బీఆర్‌ఎస్‌ నుంచి నవీన్‌కుమార్‌ రెడ్డి, కాంగ్రెస్‌ అభ్యర్థిగా మన్నె జీవన్‌రెడ్డి, స్వతంత్ర అభ్యర్థిగా సుదర్శన్‌ గౌడ్‌ బరిలో ఉన్నారు.

ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

షాద్ నగర్ – మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఫరూక్ నగర్ మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎన్నికల కేంద్రంలో జరుగుతున్న ఓటింగ్ సందర్భంగా తన ఓటు వేశారు. ఖచ్చితంగా ఎమ్మెల్సీ ఎన్నికలలొ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి జీవన్ రెడ్డి గెలుపు ఖాయం అని అన్నారు. ఎమ్మెల్యే వెంట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బాల్ రాజ్ గౌడ్, రఘ, సీతారాం, ముబారక్, తుపాకుల శేఖర్ తదితరులు ఉన్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement