దేవరుప్పుల, (ప్రభన్యూస్): మండల కేంద్రంలోని ప్రధానరహదారిలో 40 సంవత్సరాల క్రితం నిర్మించిన బస్టాండ్ కబ్జాకు గురికాకుండా ఆ స్థలంలో సులబ్ కాంప్లెక్స్ నిర్మించాలని గ్రామపంచాయతీ పాలకవర్గం తీర్మానించుకున్నారు. అందులో భాగంగా ఆ స్థలాన్ని సందర్శించారు డిపిఓ రంగాచారి. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ 40 సంవత్సరాలుగా నిరుపయోగంగా ఉంటున్న పాత బస్టాండ్ ను కొందరు వ్యక్తులు కబ్జాచేసి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని అన్నారు. అందుకు సహకరించిన కార్యదర్శి గ్రామపంచాయితిని తప్పుడు ప్రచారంచేసి తాత్కాలిక అనుమతి ఇచ్చారని, ఆవిషయం మా దృష్టికి రాగా విచారించి రద్దుచేశామనిఅన్నారు.
ఇప్పటికి కూడా ఈస్టలం వ్యవసాయభూమిగానే ఉందని రైతు బంధు కూడా తీసుకుంటున్నారని, ఈ స్టల పాసు పుస్తకాన్ని ఆర్డీఓద్వారా కలెక్టర్ కు అందజేసిన తర్వాత కలెక్టర్ ఆదేశాలమేరకు ఇక్కడికి వచ్చామని అన్నారు. వంద శాతం ఈ స్థలంలో సులబ్ కాంప్లెక్స్ నిర్మించుకోవచ్చని, అందులో ఎటువంటి సందేహం లేదని, త్వరలోనే ఇక్కడ సులబ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులు చేసుకొమ్మని సూచించారు అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తీగల.దయాకరమండల నాయకులు పల్లాసుందర్ రామ్ రెడ్డి, బస్వ.మల్లేష్, ప్రధాన కార్యదర్శి చింత.రవిజోగు, ఎంపీపి కొల్లూరి.సోమన్న, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ డైరెక్టర్ బిక్షపతి, డంగి.వెంకటేశ్వర్లు, తీగల.సోమయ్య, యాదగిరితిరుమలేష్, తదితరులు పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily