బస్సులో బుస్ బుస్ అనే సౌండ్ రావడంతో ప్రయాణీకులు ఒక్కసారిగా కంగుతున్నాయి. ఎక్కడి నుంచో పాము ఉన్నట్లు సౌండ్ వస్తుందేనని వెతికారు. వివరాల్లోకి వెళ్తే ఇలా.. ఈ ఘటన నిర్మల్ జిల్లా కుంటాల మండలం ఓల గ్రామం వద్ద చోటు చేసుకుంది. బైంసా నుండి నిర్మల్ వెళ్తున్న ఆర్టీసి బస్సులో ఈ నాగుపాము కనిపించగా.. దాన్ని చూడగానే ప్రయాణికులంతా ఒక్కసారిగా కేకలు వేయగా.. ఆర్టీసీ బస్ డ్రైవర్ సైతం ఆందోళనకు గురయ్యాడు.
నర్సాపూర్ గ్రామం వద్ద బస్సును నిలిపివేసి పాము కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కండక్టర్ వెనుక సీట్లో పాము నక్కి ఉండటంతో జావేద్ అనే ప్రయాణికుడు ధైర్యం చేసి ఆ పామును హతమార్చాడు. అంతా మంచికే జరిగిందని.. ఒకవేళ మార్గం మద్యలో ఎవరిపైనైనా పాము దాడి చేసి ఉంటే ఎంత ప్రమాదం జరిగేదో అంటూ నిర్మల్ చేరేంత వరకు చెవులు కొరుక్కుంటూనే ఉన్నారు ప్రయాణికులు. కాగా, ఆ బస్సులోని ఓ ప్రయాణీకుడు ఈ తతంగం మొత్తం వీడియో తీసి ఇంటర్నెట్లో పోస్ట్ చేయగా.. ప్రస్తుతం అది కాస్తా వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు.