యాదాద్రి భువనగిరి జిల్లాజిల్లాలోని పగిడిపల్లి-బొమ్మాయిపల్లి మధ్య శుక్రవారం ఉదయం 11 గంటలకు బెంగాల్ నుంచి సికింద్రాబాద్ వస్తున్న ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లోని ఒక బోగీల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గమనించిన ప్రయాణికులు చైన్ లాగడంతో పైలట్ వెంటనే రైలును నిలిపివేశారు. కాగా, ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. అగ్నిప్రమాదంలో ఒక్క ప్రయాణికుడికి కూడా చిన్న గాయం కాకుండా ఉండటానికి ఓ వ్యక్తి కారణం. ఒక బోగిలో మంటలు వ్యాపించిన విషయాన్ని గమనించిన ఆ వ్యక్తి వెంటనే చైన్ లాగడంతో రైలు ఆగింది. అంతే కాకుండా ప్రయాణీకులను అప్రమత్తం చేశాడు.. ఆ బోగీలు ప్రయాణీకులు వెంటనే కిందకు దిగారు.. మిగిలిన బోగీల ప్రయాణీకులను సైతం హెచ్చరించడంతో వారు సైతం బోగీల నుంచి బయటకు దూకేశారు..
ప్రయాణీకులు దిగుతుండగానే మంటలు పక్క బోగీలకు అంటుకున్నాయి. ఎస్ 4, 5, 6, పూర్తిగా కాలిపోగా,మరో నాలుగు బోగీలు పాక్షికంగా తగులబడ్డాయి.. కాగా ఇంతమంది ప్రాణాలు కాపాడిన వ్యక్తి పలాస వాసిగా గుర్తించారు.. ప్రయాణీకులను అప్రమత్తం చేసే సందర్భంలో డిప్రెషన్ గురయ్యాడు.. తోటి ప్రయాణీకులు అతడికి సపర్యలు చేశారు.. అ తర్వాత రైల్వే సిబ్బంది అతడిని హాస్పటల్ కు తరలించారు.. అతడికి ఎటువంటి ప్రమాదం లేదని వైద్యులు ప్రకటించారు.. కాగా, చైన్ లాగకుండా ఉండి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో తలుచుకుంటే భయమేస్తుంది అంటూ ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు . తమ ప్రాణాలు కాపాడిని శ్రీకాకుళం జిల్లా పలాస ప్రయాణీకుడికి ఫలక్ నుమా రైలులోని పాసింజర్స్ కృతజ్ఞతలు తెలిపారు..
Burning Falaknuma – చైన్ లాగి వందలాది మందిని కాపాడిన పలాస వాసి – కృతజ్ఞతలు తెలిపిన ప్రయాణీకులు ..
Advertisement
తాజా వార్తలు
Advertisement