బూర్గంపాడు 20 జూలై (ప్రభ న్యూస్):గోదావరి నది ఎగువ ప్రాంతాల్లో పడుతున్న భారీ వర్షాలకు ప్రాజెక్ట్ లు. నిండి గోదావరి నది లో నీటిని వదలడంతో గోదావరి నీటి మట్టం గంట గంటకు పెరగడంతో గోదావరి ముంపు ప్రాంత ప్రజలు భయం భయం తో వనికిపోతున్నారు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల ముంపు ప్రాంత ప్రజలు గంట గంటకు పెరుగుతున్న గోదావరి తో ఆందోళన చెందుతున్నారు
- Advertisement -
2022 జూలైలో వచ్చిన గోదావరి ప్రళయం మళ్లీ పునరావృతం ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు. గోదావరి పెరగడంతో ముంపు ప్రాంత ప్రజలను జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని లోతట్ట ప్రాంత ప్రజలకు సూచిస్తున్నారు. మండల కేంద్రంలో ఉన్నతాధికారులు హెల్ప్ సెంటర్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ప్రజలు ఎవరు వాగులు దాటి ప్రయాణం చేయవద్దని, జాలర్లు చేపల వేటకు వెళ్ళవద్దు పేర్కొన్నారు..