- హైదరాబాద్ లో పలు కంపెనీల్లో ఐటీ సోదాలు
- దేశవ్యాప్తంగా 12నగరాల్లో తనిఖీలు
- ప్రధానమంత్రి ప్రిన్సిపల్ సెక్రెటరీ అల్లుడి పేరుతో చీటింగ్
- వందల కోట్లు వసూలు చేసిన అనిల్, హన్సిత
- ఆదాయ పన్ను మినహాయింపు ఇస్తామంటూ టోకరా
- కోట్లలో లంచాలు సమర్పించుకున్న పలు సంస్థలు
హైదరాబాద్ – ప్రధానమంత్రి ప్రిన్సిపల్ సెక్రెటరీ అల్లుడుగా అనిల్, కుమార్తెగా హన్సితలు చెప్పుకుంటూ భారీ వసూళ్లు చేశారు. ఇన్కమ్ టాక్స్ లేకుండా చేస్తానంటూ కంపెనీల నుంచి వసూళ్లు చేశారు. ప్రభుత్వంలో పనులు చేయిస్తామంటూ పలు కంపెనీల నుంచి భారీగా డబ్బులు గుంజారు. పలు కంపెనీలు టాక్స్ ఎగ్గొట్టేందుకు హన్సిత, అనిల్‌లకు పెద్ద మొత్తంలో లంచాలు ఇచ్చారు. పలువురు ఇచ్చిన పిర్యాదుతో రెండు రోజుల క్రితం భువనేశ్వర్ లో పోలీసులు అరెస్ట్ చేశారు. రియల్ లైఫ్ బంటి బబ్లీ కేసుగా ఈ కుంభకోణాన్ని పోలీసులు నమోదు చేశారు. నిందితులు దేశంలోని 12ప్రాంతాల్లోని వివిధ కంపెనీల, సంస్థల నుంచి రూ.100కోట్లకు పైగా వసూళ్లు చేశారు. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో తిరుగుతూ ప్రిన్సిపల్ సెక్రెటరీ పేరుని వాడుకున్నారు.
దీంతో నిందితుల ఇచ్చిన సమాచారం మేరకు నేడు దేశంలోని 12ప్రాంతాల్లో సోదాలు చేపట్టారు ఐటి అధికారులు. హైదరాబాద్, ఆంధ్ర, భువనేశ్వర్, ఢిల్లీ, ఝార్ఖండ్‌లో సోదాలు జరుపుతున్నారు. హైదరాబాదులో నాలుగు చోట్ల కూడా సోదాలు జరుగుతున్నాయి. వందల కోట్లు వసూళ్లు చేసిన హన్సిత, అనిల్ డబ్బులతో లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు.. లగ్జరీ కార్లు, అధునాతన విల్లాలు కొనుగోలు చేశారు. వాటన్నింటిపైన ఇప్పుడు పోలీసులు, ఐటి శాఖ దర్యాప్తు చేస్తున్నది..