హైదరాబాద్, ఆంధ్రప్రభ : హైదరాబాద్ మెట్రో రైల్‌లో ‘సూపర్ సేవర్ కార్డు’ సేవలను ఎల్‌అండ్‌టీ ఎండీ కెవీబీ రెడ్డి ప్రారంభించారు. ఈ సూపర్ సేవర్ కార్డుతో సెలవుల్లో రూ.59తో నగరంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా రోజంతా మెట్రోలో ప్రయాణించవచ్చని రెడ్డి తెలిపారు. ఈ మేరకు మెట్రో వర్గాలు ప్రకటించిన 100 రోజులు సెలవుల్లో మాత్రమే ఈ రాయితీ వర్తిస్తుందని వెల్లడించారు. మెట్రో ప్రకటించిన సెలవుల వివరాలు ఇవి.. ప్రతి ఆదివారం, నెలలో రెండు, నాలుగో శనివారంతో పాటు ఉగాది, రంజాన్, మొహరం, బోనాలు, జనవరి 26, ఆగస్టు 15, వినాయక చవితి, కృష్ణాష్టమి, దుర్గాష్టమి, దసరా, దీపావళి, బాక్సింగ్ డే, బోగీ, సంక్రాంతి, శివరాత్రి తదితర పర్వదినాలున్నాయి.
ఈ సందర్భంగా కేవీబీ రెడ్డి మాట్లాడుతూ, కరోనా తర్వాత మళ్లి మెట్రో పుంజుకుంటోందన్నారు. కరోనా సమయంలో ఎక్కువ రోజులు రైళ్లను బంద్ చేయడంతో పాటు, నడిచిన సమయంలోనూ చాలా రోజుల వరకూ ప్రయాణీకులు మెట్రోపై ఆసక్తి చూపించక పోవడం వల్ల సంస్ధ నష్టాల్లో కూరుకు పోయిందన్నారు. కానీ గత కొంతకాలంగా మళ్లి ప్రయాణీకుల సంఖ్య పెరగడంతో ప్రస్తుతం మళ్లి మెట్రోలో 60 శాతం రద్దీ పెరిగిందని తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..