Monday, November 18, 2024

Budget Allocations – రుణమాఫీకి రూ.31వేల కోట్లు కేటాయింపు…

ఆంధ్రప్రభ స్మార్ట్- హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభ‌మ‌య్యాయి .. అసెంబ్లీలో బడ్జెట్ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. మండలిలో మంత్రి శ్రీధర్‌బాబు లు ప్ర‌వేశ‌పెట్టారు.. ఈ సంద‌ర్భంగా భ‌ట్టి అసెంబ్లీలో మాట్లాడుతూ రూ.2 లక్షల 91 వేల 159 కోట్లతో తెలంగాణ బడ్జెట్ ను రూపొందించామ‌న్నారు… రెవెన్యూ వ్యయం రూ.2,20,945 కోట్లు ఉండ‌గా, మూలధన వ్యయం రూ.33,487 కోట్లుగా ఉంద‌ని పేర్కొన్నారు….

సంక్షేమ ప‌థ‌కాల‌కు ఏకంగా రూ.40 వేల కోట్లు కేటాయించారు..
హార్టికల్చర్‌కు రూ.737 కోట్లు కేటాయింపు..
రోడ్లు, భవనాలకు రూ.5,790 కోట్లు..
హోంశాఖకు రూ.9,564 కోట్లు కేటాయింపు..
పశుసంవర్ధక శాఖకు రూ. 1,980 కోట్లు..
విద్యాశాఖకు రూ. 21,292 కోట్లు..
నీటి పారుదల శాఖకు రూ.22,301 కోట్లు..
ప్రజాపంపిణీకి రూ.3,836 కోట్లు..
గృహజ్యోతికి రూ.2,418 కోట్లు..
పరిశ్రమల శాఖకు రూ.2,762 కోట్లు..
ఐటీ శాఖకు రూ.774 కోట్లు..

- Advertisement -


500 రూపాయల గ్యాస్‌ సిలిండర్‌కు రూ.723 కోట్లు..
అడవులు పర్యావరణ శాఖకు రూ.1064 కోట్లు..
ట్రాన్స్‌కో, డిస్కంలకు రూ.16,410 కోట్లు..
వైద్య ఆరోగ్య శాఖకు రూ.11,468 కోట్లు..
బీసీ సంక్షేమానికి రూ.9,200 కోట్లు..
మైనార్టీ శాఖకు రూ.3,003 కోట్లు..
స్త్రీ శిశు సంక్షేమ శాఖకు రూ.2,736 కోట్లు..
రీజినల్ రింగ్‌రోడ్‌కు రూ.1525 కోట్లు..
గృహజ్యోతికి రూ.2,418 కోట్లు..
ఎస్సీ సంక్షేమానికి రూ.33,124 కోట్లు..
ఎస్టీ సంక్షేమానికి రూ.17,056 కోట్లు..
జీహెచ్‌ఎంసీ పరిధిలో మౌలిక వసతుల కల్పనకు రూ.3,065 కోట్లు.

రూ.2లక్షల రుణమాఫీ కోసం రూ.31వేల కోట్లు..
లక్ష వరకు రుణం ఉన్న 11.34 లక్షల రైతులకు రుణమాఫీ చేశాం..
రూ.2లక్షల వరకు రుణం ఉన్న రైతులకు త్వరలో రుణమాఫీ..
రైతు భరోసా పథకం కింద ఎకరాకు రూ.15వేలు ఇవ్వాలన్నది మా సంకల్పం..
త్వరలో భూమిలేని రైతు కూలీలకు ఏటా రూ.12 వేల అందిస్తాం..
ప్రధాని ఫసల్‌ బీమా యోజనలో చేరబోతున్నాం.. మొత్తం వ్యవసాయ రంగానికి రూ.72,659 కోట్లు..
విద్యుత్‌ రంగానికి రూ.16,410 కోట్లు.

Advertisement

తాజా వార్తలు

Advertisement