తెలకపల్లి, (ప్రభ న్యూస్) : దశాబ్దాలుగా మండల పరిధిలోని చిన్న ముద్దునూరు నుండి బండపల్లి మీదుగా గట్టురాయిపాకుల గ్రామాల ప్రజలు బీటీ రోడ్డు ఏర్పాటు కోసం ఎదురు చూస్తున్న తరుణంలో నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి చొరవతో బీటీ రోడ్డు కల సాకారమైందని బండపల్లి సర్పంచ్ మంద స్రవంతి సుఖ జీవన్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి కృషి వల్ల బండపల్లి మీదుగా గట్టురాయిపాకుల గ్రామం వరకు 5కిలోమీటర్లు బీటీ రోడ్డు నిర్మాణం కోసం మూడు కోట్ల రూపాయల సీఆర్ఆర్ గ్రాంట్ నిధులు మంజూరు చేయించడంతో శనివారం జిల్లా గ్రంథాలయ చైర్మన్ మాధవరం హనుమంతరావు, ఎంపీపీ కొమ్ము మధు, మండల పార్టీ అధ్యక్షులు ఈదుల నరేందర్ రెడ్డి, నాగర్ కర్నూల్ నగర పంచాయతీ కౌన్సిలర్ సురేందర్ రెడ్డి లు ఎమ్మెల్యే ను కలిసి పుష్పగుచ్ఛాలు ఇచ్చి కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా మాజీ సర్పంచ్ లు మంద పర్వతరెడ్డి, మంద వినీతమ్మ, మంద సుఖ జీవన్ రెడ్డిలు రోడ్డు మంజూరుకు కృషిచేసిన ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డికి ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital