Friday, November 22, 2024

BSP – ఒక్కసారి అవకాశం ఇవ్వండి … సిర్పూర్ రూపురేఖలు మారుస్తా: డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్

సిర్పూర్ గడ్డపై నీలి జెండా ఎగరవేసి ఆంధ్ర దోపిడీ పాలనను అంతం చేయాలని అందుకు ఒక్కసారి అవకాశం ఇచ్చి భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిపించాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు.శుక్రవారం సిర్పూర్ లో నామినేషన్ సందర్భంగా కాగజ్ నగర్,సిర్పూర్ లో భారీ ర్యాలీ నిర్వహించిన అనంతరం ర్యాలీని ఉద్దేశించి మాట్లాడారు. కాంట్రాక్టుల్లో కమీషన్ల కోసమే కేసీఆర్ ప్రాణహిత-చేవెళ్ళ ప్రాజెక్టును మేడిగడ్డకు తరలించి ప్రాజెక్టు అంచనాలను రూ.1.15 లక్షల కోట్లకు పెంచి, 30 వేల కోట్లు అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు.సిర్పూర్ రైతాంగానికి సాగునీరు అందించే జగన్నాథ్ పూర్,పిపి రావు ప్రాజెక్టులతో పాటు తుమ్మిడిహట్టి,సాండ్ గాం, రణవిల్లి,కోర్సిని,గూడెం,హుడికిలి, లోనవెల్లి,సూర్జాపూర్,జంబుగ ఎత్తిపోతల ప్రాజెక్టులను పూర్తి చేయడంలో బీఅర్ఎస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు.

ఎస్పీఎం కార్మికులు రూ.35 వేలు ఇస్తానన్న బోనస్ ఎందుకు చెల్లించలేదని ప్రశ్నించారు. ఏళ్ల తరబడి పోడు భూములు సాగుచేసుకుంటున్న ఆదివాసీలకు పోడు పట్టాలు ఇవ్వలడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఆరె కులాన్ని ఓబీసి జాబితాలో చేర్చాలని డిమాండ్ చేశారు.స్థానిక ఎమ్మెల్యే కోనేరు కోనప్ప మూడు సార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించినా సిర్పూర్ నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదన్నారు.ఎలాంటి అభివృద్ధి చేయని బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ మళ్లీ ఓట్లను ఎలా అడుగుతుందని ప్రశ్నించారు. సిర్పూర్ గడ్డపై కోనప్ప అరాచకాలు,అక్రమాలు, దుష్ట పాలన నుంచి సిర్పూర్ ప్రజలకు విముక్తి లభించాలంటే బీఎస్పీని భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు.

- Advertisement -

.ర్యాలీలో బీఎస్పీ రాష్ట్ర కార్యనిర్వాహక కమిటీ కార్యదర్శి అర్షద్ హుస్సేన్,రాష్ట్ర కార్యదర్శి సిడెం గణపతి జిల్లా అధ్యక్షులు లెండుగురే శ్యామ్ రావు, మోతీరామ్ పలువురు నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement