Friday, November 22, 2024

BSP Allegations – న‌కిలీ విత్త‌నాల వ్యాపారంలో ఎమ్మెల్యే కోన‌ప్ప – ప్ర‌వీణ్ కుమార్ ఆరోప‌ణ‌

బోథ్ – తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ ఎమ్మెల్యేలే నకిలీ విత్తనాల వ్యాపారం చేస్తూ పేద రైతులను నిలువునా ముంచుతున్నారని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ,ఆంధ్ర ప్రాంతం నుండి నకిలీ విత్తనాలు తెచ్చి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అమ్ముతున్నారని, ఈ దందాకు సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కారకులని అన్నారు. బోథ్ నియోజకవర్గంలోని ఇచ్చోడలో ఆయ‌న మీడియా తో మాట్లాడుతూ, . తెలంగాణ ప్రభుత్వం రైతు రుణమాఫీ చేయలేకపోవడం వల్ల బ్యాంకులు వారి అకౌంట్లను హోల్డ్ లో పెడుతున్నారని,రై తు బంధు నిధులు వస్తే బ్యాంకులు ఆపుకుంటున్నాయని ఆయన పేర్కొన్నారు. బిఆర్ఎస్ పాలనలో రైతులకు ఒరిగిందేమీ లేదన్నారు. హైదరాబాద్ నగరంలోని వందల కోట్ల విలువైన భూములను ప్రభుత్వం రహస్య జివోల ద్వారా బిఆర్ఎస్ నాయకులకు అక్రమంగా కట్టబెడుతుందని ఆయన ఆరోపించారు.అందుకోసమే ప్రభుత్వం 59 వ జీవో తీసుకొచ్చిందన్నారు.కానీ బహుజన రాజ్యంలో ఆ భూములన్నీ స్వాధీనం చేసుకుని పేద ప్రజలకు పంచుతామన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు సీడం గణపతి,జిల్లా అధ్యక్షులు మహేందర్,ఆదిలాబాద్ జిల్లా ఇంఛార్జి నాయకులు రత్న పురం రమేష్,జిల్లా ఉపాధ్యక్షుడు లక్ష్మి కాంత్, నిర్మల్ జిల్లా అధ్యక్షుడు జగన్ మోహన్, జిల్లా నియోజకవర్గ ఇంచార్జి జంగుబాపు , మహిళా నాయకురాలు అర్చన,ఆదిలాబాద్ నియోజక వర్గ ఇంఛార్జి మెస్రం మీనా, ఆసిఫాబాద్ జిల్లా ఇంచార్జి సోయం చెన్నయ్య,ఖానాపూర్ ఇంఛార్జి బన్సీలాల్ రాథోడ్,సీనియర్ నాయకులు మేకల మల్లన్న, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement