Tuesday, December 3, 2024

Brutal Murder: తండ్రిని కడతేర్చిన కొడుకు

కన్నతండ్రినే కొడుకు అంతమొందించిన విషాద ఘటన తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..నస్రుల్లాబాద్ మండల పరిధిలోని నెమ్లీ గ్రామంలో సాయబోయి (55) కుటుంబం నివాసం ఉంటుంది. ఈ క్రమంలో గురువారం రాత్రి కుమారుడు హన్మాండ్లుతో, సాయబోయికి మధ్య స్వల్ప వివాదం జరిగింది. అయితే, ఆ గొడవ కాస్త తీవ్ర వాగ్వాదానికి దారి తీసింది.

అప్పటికే మద్యం మత్తులో ఉన్న హన్మాండ్లు తీవ్ర ఆవేశానికి లోనై తండ్రి సాయబోయిని కర్రతో బలంగా కొట్టాడు. దీంతో తీవ్రంగా గాయపడిన అతడు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement