వ్యవస్థలను నాశనం చేసిన కాంగ్రెస్
తెలంగాణలో డబుల్ ఆర్ టాక్స్
కిసాన్ సమ్మాన్ తో రైతులను ఆదుకున్నాం
కాంగ్రెస్‌కు ఓటమి ఖాయం
పత్తాలేని బిఆర్ఎస్
భారత ప్రధాని నరేంద్ర మోడీ
ఆంధ్రప్రభ, వేములవాడః దేశంలోని అన్ని వ్యవస్థలను కాంగ్రెస్ పార్టీ నాశనం చేసిందని ప్రధాని నరేంద్ర మోడీ ఆరోపించారు. బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో మాట్లాడారు. కాంగ్రెస్ అంటే స్కాంగ్రెస్ అని, ఎన్నో కుంభకోణాలకు పాల్పడ్డారన్నారు.
పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటమి ఖాయమని, బిఆర్ఎస్ పత్తా లేదన్నారు. ప్రజలు ఎన్డీఏ వైపు నిలుస్తున్నారన్నారు. గత రెండు పర్యాయాలు ఓటేసి తనకు ప్రధానిగా అవకాశం ఇస్తే దేశానికి సేవ చేశానన్నారు. దేశ భద్రతే తమకు తొలి ప్రాధాన్యమని, వంశపారంపర్య వ్యవస్థకు కేరాఫ్ కాంగ్రెస్ అన్నారు. పీవీ నరసింహారావును కూడా అవమానించిన దరిద్రపు పార్టీ కాంగ్రెస్ అని, బిజెపి ప్రభుత్వం పీవీ నరసింహారావుకు భారతరత్నతో అరుదైన గౌరవం అందించిందన్నారు. కాంగ్రెస్, బిఆర్ఎస్ ఒకటేనని అలాంటి పార్టీలకు ప్రజలు ఓటు వేయద్దు అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కుటుంబ పార్టీలను తెలంగాణ నుండి తరిమికొట్టాలన్నారు. కిసాన్ సమ్మాన్ రైతులను ఆర్థికంగా ఆదుకున్నామన్నారు.
కాంగ్రెస్, బిఆర్ఎస్ లో ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటారని, ఆ రెండు పార్టీలది అవినీతి బంధమన్నారు. కాలేశ్వరం ప్రాజెక్టు మీద కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హంగామా చేసిందని, అధికారంలోకి వచ్చి ఐదు నెలలు గడిచిన ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. తెలంగాణలో డబుల్ ఆర్ టాక్సీ వసూలు చేసిందని, త్రిబుల్ ఆర్ కలెక్షన్లను మించి వసూలు చేసిందన్నారు. తెలంగాణలో ఒక ఆర్ అక్రమంగా వసూళ్లకు పాల్పడి ఢిల్లీలో మరో ఆర్ కు అందిస్తున్నారన్నారు. కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ ని మరోసారి భారీ మేజారిటీ తో గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి తోపాటు బిజెపి ప్రజాప్రతినిధులు నాయకుల తో పాటు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.
బండి సంజయ్ ప్రసంగానికి: ఉర్రూతలూగిన వేములవాడ జనసభ
వేములవాడ జనసభలో ప్రధాని సాక్షిగా కాంగ్రెస్ పై బండి సంజయ్ పంచ్ ల వర్షం కురిపించారు. బండి సంజయ్ పంచ్ లకు వేములవాడ జనసభ ఈలలు, చప్పట్లతో మారుమోగింది. మోదీ పేరును ప్రస్తావించినప్పుడల్లా ఈలలతో హర్షధ్వానాలు పలికిన జనం హర్షనాధాలు చేశారు. బండి సంజయ్ మాట్లాడుతూ శీ విశ్వేశ్వరుడి ప్రతిరూపమే నరేంద్రమోదీ అని కొనియాడారు. దేశ చరిత్రలో తొలిసారి దక్షిణకాశీకి విచ్చేసిన నాయకుడు మోదీ మాత్రమే అన్నారు. మోదీ వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసే కుట్రను కాంగ్రెస్ చేస్తోందని, మోదీకి ఆస్తిపాస్తులు… బ్యాంకు బ్యాలెన్స్ లేవు ప్రధాని పదవి వద్దనుకుంటే జబ్చకు సంచి వేసుకుని పోయే మహనీయుడు మోదీ అన్నాడు. మోదీని కించపరుస్తున్న ఖబడ్దార్ అని కాంగ్రెస్ నేతలను హెచ్చరించారు.
మోదీ మొండిమొలోడు కాదు… ఈ దేశాన్ని భ్రష్టు పట్టించిన కాంగ్రెస్ ను మెడలు పట్టి బయటకు గెంటేసిన జగమొండి అన్నాడు. 370 ఆర్టికల్ ను రద్దు చేసి ఏక్ దేశ్ మే దో విధాన్…దో ప్రధాన్…దో నిషాన్ నహీ చలేగా అంటూ నినదించిన నా శ్యామాప్రసాద్ ముఖర్జీ ఆశయాలను అమలు చేసి వేలాది మంది బలిదానాలకు సార్ధకత చేకూర్చిన జగమొండి మోదీ అన్నాడు. ట్రిపుల్ తలాఖ్ ను రద్దు చేసి.. ముస్లిం మహిళలకు స్వేచ్ఛ కల్పించిన జగమొండి మోదీ అన్నాడు. హిందువుల 5 వందల ఏళ్ల నాటి కల అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ట కార్యాన్ని స్వహస్తాలతో నెరవేర్చిన జగమొండి మోదీ అన్నాడు. కరోనా వ్యాక్సిన్ అందించి 140 కోట్ల మంది ప్రజలకు ప్రాణాలను కాపాడిన జగమొండ మోదీ, మూతపడ్డ రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని 6 వేల కోట్లకుపైగా వెచ్చించి తెరిపించిన జగమొండి ా నరేంద్రమోదీ అన్నాడు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివ్రుద్ధికి రూ.12 వేల కోట్లు ఖర్చు చేసిన మోదీ. నరేంద్ర మోదీ ‘మేడ్ ఇన్ భారత్’… మరి సోనియా మైనో, రౌల్ విన్సీ ఎవరు? …మేడ్ ఇన్ ఇటలీమా భారతీయ జనతా పార్టీ మేడ్ ఇన్ ఇండియా… మీ కాంగ్రెస్ పార్టీ ఎక్కడిది మేడ్ ఇన్ బ్రిటీష్ మోదీ పక్కా లోకల్. మరి సోనియా ఎక్కడి నుండి వచ్చిందో కాంగ్రెస్ చెప్పాలే పక్కా లోకల్ మోడీ కావాలా? నాన్ లోకల్ రాహుల్ విన్సీ, సోనియా మైనో కావాల్నా..అని ప్రశ్నించారు.
మేడ్ ఇన్ భారత్ పార్టీ కావాల్నా? మేడ్ ఇన్ బ్రిటన్ పార్టీ కావాలా6 గ్యారంటీలను అడిగితే కాంగ్రెస్ నేతలు గాడిద గుడ్డు ఇస్తున్నారుకాంగ్రెస్ ప్రభుత్వమే పెద్ద గాడిద గుడ్డు అన్నాడు. 6 గ్యారంటీల అమలును చేయమంటే ఇచ్చింది గాడిద గుడ్డు. 2లక్షల రైతు రుణమాఫీ చేయాలని అడిగితే ఇచ్చింది అన్నాడు.. వరికి రూ.500ల బోనస్, తాలు, తరుగుతో పనిలేకుండా వడ్లు కొనమని అడిగితే మన చేతికి ఇచ్చింది అన్నాడు. .రైతులు, కౌలు రైతులకు 15వేలు, రైతు కూలీలకు 12 వేలు అడిగితే ఇచ్చింది అన్నాడు. ్డవిద్యార్థులకు రూ.5లక్షల కార్డు అడిగితే ఇచ్చింది గాడిద గుడ్డు వ్రుద్దులకు, నిరుద్యోగ భ్రుతి రూ.4 వేల పెన్షన్ అడిగితే ఇఛ్చింది అన్నాడు.మహిళలకు 2,500లు అడిగితే ఇచ్చింది అన్నాడు. అసలు కాంగ్రెస్ మ్యానిఫెస్టోనే పెద్ద గాడిద గుడ్డుఆ పార్టీ గుర్తు హస్తం కాదు…అన్నాడు. అరడుగుల బుల్లెట్ మన నరేంద్ర మోడీ ఆరు గ్యారంటీలను అమలు చేయని కాంగ్రెస్ చోర్ బ్యాచ్‌అరడుగుల బుల్లెట్ మోదీ కావాలా?? లేక చొర్ బ్యాచ్ కాంగ్రెస్ కావాలా? అన్నారు. మోదీ ఏ పని చేపట్టినా వాళ్ల అమ్మ ఆశీస్సులు తీసుకుని బయటకువస్తారు. ఇప్పుడు వారికి అమ్మ లేరు. మనమంతా మోదీ పక్షాన ఉంటూ ముచ్చటగా మూడోసారి ప్రధానిని చేసుకుందామని కోరారు.