జమలి ఎన్నికలు వస్తే బీఆర్ఎస్ కు డిపాజిట్లు కూడా రావని కరీంనగర్ ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. గురువారం కరీంనగర్ లో మీడియాతో మాట్లాడుతూ… జమిలి ఎన్నికలంటే బీఆర్ఎస్ నేతలకు భయమెందుకు అని బండి సంజయ్ ప్రశ్నించారు. మోడీ ఛరిష్మా ముందు బీఆర్ఎస్ వన్నీ నల్లముఖాలే అన్నారు. జమిలీ ఎన్నికలొస్తే… బీఆర్ఎస్ నేతలకు డిపాజిట్లు కూడా రావన్నారు. జమిలీ ఎన్నికలపై అధికారిక నిర్ణయం వెలువడకముందే ఎందుకంత తొందర అన్నారు.
కోర్టు కేసు విషయంలో తప్పుడు ప్రచారం చేసేటోళ్లు మూర్ఖులన్నారు. తాను మూడుసార్లు వాయిదా కోరిన మాట వాస్తవమని, పార్లమెంట్ సమావేశాల్లో ఉన్నప్పుడు ఎలా హాజరవుతా ? అమెరికాలో ఉన్నప్పుడు ఎలా హాజరవుతా ? అని ప్రశ్నించారు. నోటికొచ్చినట్లు మాట్లాడేటోళ్లను పట్టించుకోను అంటూ.. ఎంపీ, అసెంబ్లీ ఎన్నికలు వేర్వేరుగా జరిగితే తాను కరీంనగర్ అసెంబ్లీ నుండే పోటీ చేస్తానని స్పష్టం చేశారు.