Friday, November 22, 2024

TS | మైనంపల్లి వ్యాఖ్యలపై భ‌గ్గుమంటున్న బీఆర్ ఎస్ శ్రేణులు.. నోరు అదుపులో పెట్టుకోవాలని సూచన

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : భారాస ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు వ్యాఖ్యలపై సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. ట్రబుల్‌ షూటర్‌గా పేరొందిన మంత్రి హరీష్‌ రావుపై వ్యక్తిగత దూషణలు సరికాదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. గత నాలుగు రోజులుగా గల్లిd నుంచి రాజధాని వరకు వ్యతిరేకత బయటకు వస్తోంది. మంత్రి హరీష్‌ రావును కేవలం కేసీఆర్‌ కుటుంబ సభ్యుడిగా మాత్రమే చూడవద్దన్న అభిప్రాయం అన్ని వర్గాల నుంచి వెల్లడౖైెతోంది. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన పాత్ర మరవలేనిదని పలువరు నుంచి ప్రశంసలు పొందారు.

అలాంటి నేతపై ఆరోపణలు చేస్తున్న ఆయన.. అసలు తెలంగాణ ఉద్యమం సమయంలో మైనంపల్లి ఎక్కడ ఉన్నారని భారాస నేతలు ప్రశ్నిస్తున్నారు. రోడ్డెక్కి ఆందోళన చేశారా..? లాఠీ దెబ్బలు తిన్నారా..? జైలుకు పోయారా..? అని విమర్శలు గుప్పిస్తున్నారు. చంద్రబాబు చెంతన చేరి తెలంగాణకు ద్రోహం చేశారని మైనంపల్లి వ్యాఖ్యలపై పలువురు పార్టీ నేతలు మండిపడ్డారు. తాను ఉద్యమకారుడనని అనడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతోంది.

తెలంగాణ సాధనలో పార్టీలకు అతీతంగా సపోర్ట్‌
ప్రత్యేక రాష్ట్ర పోరాటంలో ట్రబుల్‌ షూటర్‌ ముందుండి నడిపించారు. ఉద్యమాన్ని గ్రామ గ్రామానికి తీసుకెళ్లడంలో ఆయన పాత్ర మరవలేనిది. విమర్శలు చేయడంలోనూ, పార్టీని గెలిపించడంలోనూ తనదైన ముద్రను వేశారు. ఉద్యమ పోరాటంలో ప్రతిక్షణం అందుబాటులో ఉంటూ కార్యచరణను అమలు చేయడంలో సక్సెస్‌ అయ్యారు. మంత్రి హరీష్‌ రావును పార్టీలకు అతీతంగా అందరూ ఇష్టపడతారు.

- Advertisement -

ఉద్యమంలోనూ అందరూ మద్దతు ప్రకటించారు. పార్టీలు వేరైనా పోరాటంలో వెనక నుంచి అధికార పక్షాల నేతలు అండగా నిలిచారు. అందరిని ఒప్పించి మెప్పించడంలో ట్రబుల్‌ షూటర్‌ను మించిన లీడర్‌ లేడని ఇతర పార్టీల నుంచి ప్రశంసలు లభించాయి. ఇప్పుడు ప్రభుత్వంలోనూ అందరి మన్ననలను పొందారు. 9 ఏళ్ల పాలనలో హరీష్‌ రావు కష్టంపై అన్ని వర్గాల నుంచి మద్ధతు లభించింది. నిరంతరంగా ప్రజల కోసం తపన పడే మనిషిగా, కష్ట జీవిగా ఆయనకు గుర్తింపు ఉంది. ఇలాంటి నేతను వ్యక్తిగతంగా టార్గెట్‌ చేస్తూ విమర్శించడం తగదని గులాబీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

మైనంపల్లి సీటు గోల..
సీట్లు, ఓట్ల గోల ఉంటే అంతర్గతంగా చూసుకోవాలి కానీ, పవిత్రమైన ఏడుకొండల స్వామి చెంతన వ్యక్తిగత దూషణలు చేయడం ఏ మాత్రం సమర్థనీయం కాదని పార్టీలకు అతీతంగా మైనంపల్లి వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం అవుతోంది. రాజకీయాల్లో వ్యక్తిగత దూషణలు ఏ మాత్రం క్షమించరానివని తెలుపుతున్నారు. కొడుకు సీటు కోసం మరొకరి జీవితంపై దూషణ చేయడం దారుణమని మండిపడుతున్నారు. టికెట్‌ ఇస్తే మంచోడు.. టికెట్‌ ఇవ్వకుంటే చెడ్డోడు అన్న ధోరణి ఉన్న నేతలు ప్రజలకు సేవ ఎలా చేస్తారో అర్థం చేసుకోవచ్చని సూచిస్తున్నారు. ఇలాగే చూస్తూ ఉంటే ఏకంగా సీఎం కేసీఆర్‌ పైనా విమర్శలు చేసే అవకాశం కల్పించిన వారమవుతామన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు మంత్రి హరీష్‌ రావును దూషించిన మైనంపల్లి రేపు మరొకరిని తిట్టకుండా ఉంటాడా అనే ప్రశ్నలను లేవనెత్తుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement