హైదరాబాద్ – అభివృద్ధి చేసినా దుష్ప్రచారం వల్ల తాము ఓడిపోయామన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. తెలంగాణ భవన్ లో శనివారం జరిగిన పెద్ద పల్లి పార్లమెంటు నియోజక వర్గ సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పెద్దపల్లి పార్లమెంటు స్థానాన్ని కైవసం చేసుకునేందుకు కార్యకర్తలు సమష్టిగా పని చేయాలని పిలుపు ఇచ్చారు. ఎవరూ అధైర్య పడొద్దని కోరారు. ముందు ముందు మనకు మళ్ళీ మంచి రోజులు వస్తాయి. కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగా పార్టీ నడుస్తుందన్నారు.
కెసిఆర్ కోలుకుంటున్నారు…
కేసీఆర్ కోలుకుంటున్నారని.. త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యవంతుడై ప్రజల మధ్యలోకి వస్తారన్నారు. ఫిబ్రవరిలో తెలంగాణ భవన్‌కి వచ్చి ప్రతి రోజూ కార్యకర్తలను కలుస్తారని స్పష్టం చేశారు. త్వరలోనే కేసీఆర్ జిల్లాల పర్యటనలు ఉంటాయన్నారు. కిట్ మీద కేసీఆర్ గుర్తును కాంగ్రెస్ ప్రభుత్వం చెరిపేస్తోంది కానీ తెలంగాణ ప్రజల గుండెల నుంచి తొలగించలేరన్నారు.
కాంగ్రెస్ ది రద్దుల ప్రభుత్వమే..
కేసీఆర్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను రద్దు చేస్తున్నారని హరీష్ రావు ఫైర్ అయ్యారు.. కాంగ్రెస్ ప్రభుత్వం రద్దులు వాయిదాలు అన్నట్టుగా నడుస్తోందన్నారు. కాంగ్రెస్ విపరీత చర్యలపై ఉద్యమిస్తామని వార్నింగ్ ఇచ్చారు.. బీఆర్ఎస్ కార్యకర్తలపై కక్ష సాధింపు చర్యలకు దిగితే ఎమ్మెల్యేలం అంతా బస్సు కట్టుకుని భాదితుల దగ్గరకు వెళ్లి ప్రభుత్వాన్ని నిలదీస్తామని స్పష్టం చేశారు.. . కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని పేర్కొన్నారు.
ఉద్యమం కోసం రాజీనామాలు చేసిన చరిత్ర మాది..
తెలంగాణ కోసం ఉద్యమంలో రాజీనామాలు చేశాం తప్ప రాజీ పడలేదన్నారు మంత్రి హరీష్ .. ఈ ప్రభుత్వ తీరు చూస్తుంటే ఏడాది లోనే ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదనిపిస్తోందని జ్యోస్యం చెప్పారు.. ఇక కొన్ని చోట్ల వడ్ల పైసలు కూడా పడలేదని, అలాగే రైతు బంధు కూడా వేయలేదన్నారు..ఇలా అయితే . రైతు వ్యవసాయం ఎలా చేయాలని ప్రశ్నించారు. తొలిసారి ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నామని, తమ సత్తా ఏమిటో చూపిస్తామన్నారు.