సూర్యాపేట, ప్రభన్యూస్ ప్రతినిధి: సాధారణ ఎన్నికలకు సమయం సమీపిస్తుండటంతో ఉమ్మడి నల్గొండ జిల్లాలో రాజ కీయం వేడె క్కుతోంది. మూడు జిల్లాలుగా ఏర్పడిన పాత నల్గొండ(ఉమ్మడి)పై విపక్షనాయ కులు దృష్టి కేంద్రీకరించారు. ఉద్యమాల గడ్డగా పేరున్న నల్గొండలో గత వైభవాన్ని తిరిగి పొందాలని కాంగ్రెస్ నాయకులు అడు గులేస్తున్నారు.
కాంగ్రెస్‌కు కంచుకోట
నాడు.. ఉమ్మడి నల్గొండ జిల్లా అంటే కాంగ్రెస్‌కు కంచు కోట. ఏ ఎన్నికల్లో చూసినా ఆ పార్టీ జెండానే రెపరెపలాడేది. తెలుగుదేశం పార్టీ వేవ్‌లోనూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అత్య ధిక అసెంబ్లిd స్థానాలు కాంగ్రెస్ సొంతమయ్యాయి. అసెంబ్లిd నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే… 1952 నుంచి మొదలైన ఎన్నికల ఘట్టంలో నల్గొండలో కాంగ్రెస్ ఏడుసార్లు, దేవర కొండలో 6 దఫాలు, మునుగోడులో 6సార్లు, సాగర్‌లో 2 సార్లు, మిర్యాలగూడలో 7సార్లు, హుజూర్‌నగర్‌లో 5 సార్లు, కోదాడలో 3సార్లు, ‘సూర్యాపేటలో ఐదు దఫాలు, నకిరేకల్‌లో 2 సార్లు, తుంగతుర్తి 8 సార్లు, నకిరేకల్‌లో 3 సార్లు, ఆలేరులో 6సార్లు, భువనగిరిలో 4సార్లు కాంగ్రెస్ విజయం సాధించ డంతో ఉమ్మడి జిల్లా కాంగ్రెస్‌కు కంచు కోట గా మారింది. పలు సార్లు గెలిచిన నాయ కుల్లో జానారెడ్డి, ఉత్తమ్ కుమార్‌రెడ్డి, దామోదర్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంటి వారు ఉద్దండ నాయకులుగా ఎదిగారు.
బీఆర్‌ఎస్… తొలి అడుగు
ఉమ్మడి రాష్ట్రానికి 2004లో జరిగిన ఎన్నికల్లో తొలిసారి పోటీ-చేసిన బీఆర్‌ఎస్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఒక్క ఆలేరు నియోజకవర్గంలో విజయం సాధించింది. 2009లో ఆ ఒక్క స్థానాన్ని కూడా కోల్పోయింది. ఈ క్రమంలోనే తెలంగాణ ఉద్యమం ఉధృతమైంది. నల్గొండ జిల్లా నుంచి ఉద్యమానికి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి నాయకత్వం వహించారు. మరోవైపు పార్టీ బలోపేతానికి నాయకులు కృషి చేశారు. దీంతో తెలంగాణ ఏర్పాటు- అనంతరం 2014లో జరిగిన ఎన్నికల్లో జిల్లాలో బీఆర్‌ఎస్ బలం పుంజుకుంది. 12 స్థానాలకు గాను ఏడింటిలో విజయం సాధించింది.. ఈ ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే… కాంగ్రెస్‌కు తొలి దెబ్బ తగిలినట్టయింది. 2018లో జరిగిన ఎన్నికల్లో.. అధికసీట్లు- -కై-వసం చేసుకుంది. ఈ మధ్య కాలంలో జరిగిన మూడు బై ఎలక్షన్లలోనూ మంత్రి జగదీష్ రెడ్డి పూర్తి బా ధ్యతలు తీసుకుని, వ్యూహాత్మక అడుగులేయడంతో అన్నిచోట్లా బీఆర్‌ఎస్ విజయం సాధించి, జిల్లాను క్లీన్ స్వీప్ చేసింది.
గత వైభవం కోసం…
రాష్ట్ర వ్యాప్తంగా చూసినా ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్‌కు ఉన్న పెద్ద నాయకులు ఏ జిల్లాలోనూ లేరు. దీంతో రాష్ట్ర నాయకత్వం చూపు ఈ జిల్లాపై పడి రానున్న ఎన్నికల్లో కీలకం కానుంది. 12/12 బీఆర్‌ఎస్ సంఖ్యను మార్చాలని.. అలనాటి కాంగ్రెస్ వైభవాన్ని తిరిగి పొందాలని నాయకులంతా యత్నిస్తున్నారు. ఇందు కోసం ఈ జిల్లాలో బీఆర్‌ఎస్‌కు కీలకంగా వ్యవహరిస్తున్న మంత్రి జగదీష్‌రెడ్డినే టార్గెట్ చేసి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యా ప్తంగా ప్రత్యేకంగా బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమి టో చూపాలని సవాళ్లు విసురుతున్నారు. ఈ ఉమ్మడి జిల్లా నుంచే గణనీ యమైన స్థానాలు సాధిస్తే… అధికారం సులువ వు తుందన్న భావనతో కాంగ్రెస్ ఉద్దండులున్నట్టు- అర్థమ వుతోంది.
సవాళ్లు… ప్రతి సవాళ్లు
పీపుల్స్ మార్చ్ చేస్తున్న సీఎల్పీ నేత భట్టివిక్రమార్క అన్ని జిల్లాల్లోనూ సవాళ్లు విసురుతున్నారు. కాంగ్రెస్‌కు చెందిన మాజీ ఎమ్మెల్యేలూ, సీనియర్ నాయకులూ తమదైన శైలిలో ముఖ్యమంత్రి, మంత్రి జగదీష్ రెడ్డి పైనా విమర్శలు గుప్పి స్తు న్నారు. ఎక్కడ ఏ జిల్లాలో భట్టి విక్రమార్క ఎటు-వంటి విమ ర్శలు చేసినా అన్నింటికీ తానై… మంత్రి జగదీష్ రెడ్డి స్టాటి స్టికల్ రిపోర్టును ముందుంచి దమ్ముంటే అభివృద్ధిపై చర్చలకు రావా లని ప్రతిసవాళ్లు విసురుతున్నారు. మునుగోడులో ప్లnోరైడ్ భూతాన్ని పెంచి పోషించిందెవరని.. సూర్యాపేటలో మూసీ మురుగు నీటిని తాగించిందెవరని… మంత్రి సూటిగా ప్రశ్నిసు ్తన్నారు. ఇక విద్యుత్ విషయంలోనూ అన్నదాతలకు కాంగ్రెస్ ఏం చేసిందో చెప్పాలని నిలదీస్తున్నారు. ఈ రోజు కాళె శ్వరంతో చివరి భూములకు నీరందుతున్నది నిజం కాదా… అంటూ ప్రశ్నిస్తున్నారు. ఉద్యమ సమయంలోనే కేసీఆర్ ఉమ్మడి జిల్లా లో ప్రతి ప్రాంతంలో తిరిగి ప్రజల గోసను చూసి… ఎక్కడ ఏం చేయాలో అక్కడ అది చేసి చూపించారని దీటుగా సమాధా నం ఇచ్చారు. అభివృద్ధి జరగలేదని మీరు నిరూపిస్తే క్షమా పణ లకు సిద్ధమని… జరిగింది అని తాము నిరూపిస్తే కాంగ్రెస్ పెద్ద నాయకులు ముక్కు నేలకు రాస్తారా అంటూ సవాల్ విసిరారు.
ప్రజలే అంతిమ నిర్ణేతలు
నాడు కాంగ్రెస్‌కు కంచుకోట… నేడు బీఆర్‌ఎస్‌కు బ్రహ్మ రథం పట్టింది. ఈ దశాబ్ద కాలంలో ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఎక్కడెక్కడ ఏం జరిగిందో ఇంకా ఏం జరగాల్సి ఉందో ప్రజలు గమనిస్తున్నారు. రానున్న సాధారణ ఎన్నికల్లో విజ్ఞులైన ఓటర్లే అంతిమ నిర్ణేతలు.గా ఇప్పటి నుంచే నాయకులు తమ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.